గురువారం 25 ఫిబ్రవరి 2021
Jangaon - Jan 29, 2021 , 00:28:39

ఎంపీపీల ఫోరం జిల్లా అధ్యక్షురాలిగా జయశ్రీ

ఎంపీపీల ఫోరం జిల్లా అధ్యక్షురాలిగా జయశ్రీ

లింగాలఘనపురం/నర్మెట,  జనవరి 28: ఎంపీపీల ఫోరం జనగామ జిల్లా అధ్యక్షురాలిగా లింగాలఘనపురం ఎంపీపీ చిట్ల జయశ్రీ ఎన్నికయ్యారు. జిల్లా కేంద్రంలో గురువారం ఎంపీపీల సమావేశం నిర్వహించారు. జిల్లాలో 12 మంది ఎంపీపీలకు ఎనిమిది మంది హాజరై చిట్ల జయశ్రీని ఎన్నుకున్నారు. సమావేశంలో చిట్ల జయశ్రీ-లింగాలఘనపురం, తేజావత్‌ గోవర్ధన్‌-నర్మెట, మేకల వరలక్ష్మి-రఘునాథపల్లి, బామండ్ల నాగజ్యోతి-బచ్చన్నపేట, రడపాక సుదర్శన్‌-జఫర్‌గడ్‌, జొన్నగోని హరిత-తరిగొప్పుల, బొమ్మిశెట్టి సరిత-చిలుపూరు, కందుల రేఖ-స్టేషన్‌ఘన్‌పూర్‌ హాజరయ్యారు. చిట్ల జయశ్రీ అధ్యక్షురాలిగా, తేజావత్‌ గోవర్ధన్‌ వర్కింగ్‌ ప్రసిడెంట్‌గా, ఉపాధ్యక్షులుగా మేకల వరలక్ష్మి, బామండ్ల నాగజ్యోతి, ప్రధానకార్యదర్శిగా రడపాక సుదర్శన్‌, కోశాధికారిగా  జొన్నగోని హరిత, కార్యవర్గ సభ్యులుగా బొమ్మిశెట్టి సరిత, కందుల రేఖ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా చిట్ల జయశ్రీ మాట్లాడుతూ తనకు అవకాశం ఇచ్చిన ఎంపీపీలకు కృతజ్నతలు తెలిపారు. ఎంపీపీల హక్కులు, విధుల కోసం నిరంతరం పోరాడుతానన్నారు. కార్యక్రమంలో వ్యవసాయమార్కెట్‌ వైస్‌ చైర్మన్‌ ఆగిరెడ్డి, డైరెక్టర్‌ రాజు, నాయకులు చిట్ల ఉపేందర్‌రెడ్డి పాల్గొన్నారు.    

ఎంపీపీల ఫోరం జిల్లా వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా గోవర్ధన్‌

ఎంపీపీల ఫోరం జిల్లా వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా నర్మెట మండల ఎంపీపీ తేజావత్‌ గోవర్ధన్‌  ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా గోవర్ధన్‌ మాట్లాడుతూ ఎంపీపీల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు. 

VIDEOS

logo