శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
Jangaon - Jan 28, 2021 , 00:16:01

ప్రతి మొక్కనూ సంరక్షించాలి : ముత్తిరెడ్డి

ప్రతి మొక్కనూ సంరక్షించాలి : ముత్తిరెడ్డి

నర్మెట, జనవరి 27 : జనగామ - హుస్నాబాద్‌ రహదారిలో ఇరువైపు లా నాటుతున్న ప్రతి మొక్కనూ సంరక్షించాల్సిన బాధ్యత అధికారులు, ప్రజాప్రతినిధులపై ఉందని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అన్నారు. బుధవారం సాయంత్రం నర్మెట, తరిగొప్పుల మండల కేంద్రాలతో పాటు బొంతగట్టు నాగారం, బొత్తలపర్రె గ్రామాల్లో ఆయన పర్యటించి, రోడ్డు కిరువైపులా నాటిన మొక్కలను పరిశీలించారు. ముత్తిరెడ్డి మాట్లాడుతూ మొక్కలకు ట్రీగార్డులు ఏర్పాటు చేయాలన్నారు. మొక్కల సంరక్షణకు గ్రామ పంచాయతీ నుంచి 10 శాతం నిధులు వాడుకునే అవకాశముందన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ నియోజకవర్గ కోఆర్డినేటర్‌ గుజ్జ సంపత్‌రెడ్డి, డీపీవో రంగాచారి, ఎంపీడీవోలు ఖాజామొయినొద్దీన్‌, ఇంద్రసేనారెడ్డి, సర్పంచ్‌లు కమలాకర్‌రెడ్డి, ప్రభుదాస్‌, జడ్పీటీసీలు మాలోత్‌ శ్రీనివాస్‌, ముద్దసాని పద్మజారెడ్డి, రైతుబంధు సమితి మండల కన్వీనర్లు సురేశ్‌, జూంలాల్‌, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షులు సుధాకర్‌,  పింగిళి జగన్మోహన్‌రెడ్డి, నాయకులు సత్యనారాయణ, కిషన్‌ పాల్గొన్నారు.


VIDEOS

logo