సోమవారం 08 మార్చి 2021
Jangaon - Jan 27, 2021 , 02:12:14

పల్లె ప్రగతితోనే గ్రామాల అభివృద్ధి

పల్లె ప్రగతితోనే గ్రామాల అభివృద్ధి

  • మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు
  • గూడూరులో జాతీయ జెండాకు వందనం

పాలకుర్తి రూరల్‌, జనవరి 26: రాష్ట్ర ప్రభుత్వం, సీఎం కేసీఆర్‌ చేపట్టిన పల్లె ప్రగతితో గ్రామాలు అన్ని రంగాల్లో అ భివృద్ధి చెందుతున్నాయని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. గణతంత్ర వేడుకల్లో భాగంగా జనగామ జిల్లా పా లకుర్తి మండలం గూడూరు పంచాయతీ కార్యాలయంలో జాతీయ జెండాకు వందనం చేశారు. ఆ తర్వాత పల్లెప్రగతి లో నిర్మించిన వైకుంఠధామం, స్వర్గరథం, ఫ్రీజర్‌, పల్లె ప్రకృతివనాన్ని ప్రారంభించారు. ప్రజల దయతో ఎమ్మెల్యేగా గెలిచానని, సీఎం కేసీఆర్‌ దయతో మంత్రినయ్యానని, తన పనితీరుకు అవార్డులే నిదర్శనమన్నారు. ఇప్పటికే కేంద్రం పలు అవార్డులు అందించినట్లు తెలిపారు. సీఎం కేసీఆర్‌ ప థకాలను కేంద్రం మెచ్చుకుంటున్నదన్నారు. ఇక్కడ ఎం పీపీ నల్లానాగిరెడ్డి, జడ్పీ ఫ్లోర్‌లీడర్‌ పుస్కూరి శ్రీనివాసరావు, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు పసునూరి నవీన్‌, జడ్పీ కో ఆప్షన్‌ సభ్యుడు ఎండీ మదా ర్‌, స ర్పంచ్‌ల ఫోరం మండలాధ్యక్షుడు వీరమనేని యాకాంతారావు, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ ముస్కు రాంబాబు, ఎం పీటీసీ చెరిపెల్లి రాజేశ్వరి, విజయ్‌కుమా ర్‌, ఎఫ్‌ఎస్‌సీఎస్‌ బ్యాంక్‌ చైర్మన్‌ బొబ్బల ఆశోక్‌రెడ్డి, ఉప సర్పంచ్‌ వడ్లకొండ ఆండా లు, మాజీ సర్పంచ్‌ మాచర్ల పుల్లయ్య, నక్క నాగయ్య, మేడారపు సుధాకర్‌ పాల్గొన్నారు.

VIDEOS

logo