సోమవారం 08 మార్చి 2021
Jangaon - Jan 26, 2021 , 00:40:34

క్రీడలతో పెరుగనున్న స్నేహభావం

క్రీడలతో పెరుగనున్న స్నేహభావం

  • ఎర్రబెల్లి చారిటబుల్‌ ట్రస్టు చైర్‌పర్సన్‌ ఉషాదయాకర్‌రావు

దేవరుప్పుల, జనవరి 25 : క్రీడలతో స్నేహభావం పెరుగుతుందని ఎర్రబెల్లి చారిటబుల్‌ ట్రస్టు చైర్‌పర్సన్‌ ఉషాదయాకర్‌రావు అన్నారు. మండలంలోని బంజరలో  సోమవారం జిల్లా స్థాయి క్రికెట్‌ పోటీలను ఆమె  ప్రారంభించారు. ఉషాదయాకర్‌రావు మాట్లాడుతూ గ్రామీణ క్రీడలను ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నదన్నారు. యువత వ్యసనాలకు దూరంగా ఉండాలని కోరారు. క్రికెట్‌ పోటీలకు  56 జట్లు రాగా ప్రథమ బహుమతిగా రూ.21 వేలను టీఆర్‌ఎస్‌ నాయకుడు శ్యామల విక్రంరెడ్డి, రెండో బహుమతికి జడ్పీటీసీ పల్లా భార్గవి రూ.10 వేలు , మూడో బహుమతికి  ఎంపీపీ బస్వ సావిత్రి రూ. 5 వేలు, బెస్ట్‌ టీం అవార్డుకు బానోత్‌ కిరణ్‌కుమార్‌ రూ.3 వేలు ఇస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ మాలోత్‌ కవిత, పీఏసీఎస్‌ చైర్మన్‌ లింగాల రమేశ్‌రెడ్డి, వైస్‌ ఎంపీపీ కత్తుల విజయ్‌కుమార్‌, ప్రజాప్రతినిధులు శ్యామల విక్రంరెడ్డి, పల్లా సుందరరాంరెడ్డి, బస్వ మల్లేశ్‌, కొల్లూరు సోమయ్య, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు తీగల దయాకర్‌, మల్లికార్జున్‌, మార్కె ట్‌ కమిటీ వైస్‌చైర్మన్‌ కృష్ణమూర్తి, డైరెక్టర్‌ జోగేశ్‌, కోతి ప్రవీణ్‌,  వంగ అర్జున్‌, మాలోత్‌ మధుసూదన్‌ నాయక్‌ తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా  అయోధ్యలో నిర్మిస్తున్న రామమందిర నిర్మాణానికి ఎర్రబెల్లి చారిటబుల్‌ ట్రస్టు ద్వారా విరాళాలు సేకరించి ఇవ్వనున్నట్లు ఉషాదయాకర్‌ రావు తెలిపారు. అనంతరం ఆమె విరాళాల సేకరణ ప్రారంభించగా బుక్క రామయ్య అండ్‌ సన్స్‌ రూ.5,116  విరాళం అందజేశారు. 

VIDEOS

logo