సోమవారం 01 మార్చి 2021
Jangaon - Jan 25, 2021 , 00:50:36

ఆత్మీయ సమ్మేళనానికి టీఆర్‌ఎస్‌ శ్రేణులు తరలిరావాలి

ఆత్మీయ సమ్మేళనానికి టీఆర్‌ఎస్‌ శ్రేణులు తరలిరావాలి

లింగాలఘనపురం/చిలుపూర్‌, జనవరి 24 : స్టేషన్‌ఘన్‌పూర్‌లో సోమవారం నిర్వహించే టీఆర్‌ఎస్‌ నియోజకవర్గ ఆత్మీయ సమ్మేళనానికి కార్యకర్తలు భారీగా తరలిరావాలని నాయకులు కోరారు. ఆదివారం లింగాల ఘనపురంలో నిర్వహించిన సమావేశంలో టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు బొల్లంపెల్లి నాగేందర్‌, చిలుపూర్‌లో జరిగిన సమావేశంలో మార్కెట్‌ వైస్‌ చైర్మన్‌ మాలోత్‌ రమేశ్‌ మాట్లాడా రు. ఎమ్మెల్యే డాక్టర్‌ తాటికొండ రాజయ్య నేతృత్వంలో జరిగే సమావేశానికి పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తరలిరావాలన్నా రు. ఈ సమావేశంలో మండల ఇన్‌చార్జి ఉడుగుల భాగ్యలక్ష్మి, మాజీ వైస్‌ ఎంపీపీ గవ్వల మల్లేశం, సొసైటీల చైర్మన్లు మల్గ శ్రీశైలం, బుషిగంపల ఉపేందర్‌, మార్కెట్‌ వైస్‌చైర్మన్‌ ఆగారెడ్డి, నాయకులు శిరీషరాజు, ఏదునూరి వీరన్న, రాంచందర్‌, గండి యాదగరి, కడారి కృష్ణ, కేమిడి యాదగిరి, తీగలతండా సర్పంచ్‌ లక్ష్మీఠాగూర్‌, బాదావత్‌ వెంకటేశ్‌, టీఆర్‌ఎస్వీ మండల ఇన్‌చార్జి తిరుపతి, భూక్యా భద్రమ్మ, తీగల సాంబరాజు పాల్గొన్నారు.


VIDEOS

logo