సోమవారం 01 మార్చి 2021
Jangaon - Jan 25, 2021 , 00:50:34

రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‌ ఫొటోను కరెన్సీపై ముద్రించాలి

రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‌ ఫొటోను కరెన్సీపై ముద్రించాలి

బచ్చన్నపేట, జనవరి 24 : భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ ఫొటోను కరెన్సీపై ముద్రించాలని అం బేద్కర్‌ ఫొటో సాధన సమి తి ప్రధాన కార్యదర్శి కడా రి జితేందర్‌ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఆదివారం మండలంలోని పోచన్నపేటలో అంబేద్కర్‌ విగ్రహానికి ఆయ న నివాళులర్పించారు. జితేందర్‌ మాట్లాడుతూ అణగారిన వర్గాల హక్కుల కోసం జీవితాన్ని అంకితం చేసిన అంబేద్కర్‌ను కేంద్ర ప్రభుత్వం గుర్తించాలన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ గట్టు మంజుల, ఎంపీటీసీ సభ్యురాలు మామిడి అరుణ, నాయకులు సత్తయ్య, కొమురయ్య, ఐలయ్య, ఎల్లేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

లింగాలఘనపురంలో..

లింగాలఘనపురం : ఇండియన్‌ కరెన్సీపై అంబేద్కర్‌ ఫొటోను ముద్రించాలని కళ్లెం సొసైటీ అధ్యక్షుడు బుషిగంపల ఉపేందర్‌గౌడ్‌ అన్నారు. మండలంలోని కళ్లెంలో ఆదివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మా ట్లాడుతూ ఆర్‌బీఐ ఆవిర్భావానికి ముందే అంబేద్కర్‌ ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చారన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు మబ్బు రమేశ్‌, బాల్నె శేఖర్‌, మబ్బు నగేశ్‌, పరశురాములు, నరేశ్‌, నర్సయ్య, శ్రీను, ఐలమల్లయ్య, భిక్షపతి, గోవర్ధన్‌ తదితరులు పాల్గొన్నారు. 

VIDEOS

తాజావార్తలు


logo