మంగళవారం 09 మార్చి 2021
Jangaon - Jan 24, 2021 , 03:38:27

అన్నివర్గాల సంక్షేమమే సీఎం కేసీఆర్‌ ధ్యేయం

అన్నివర్గాల సంక్షేమమే సీఎం కేసీఆర్‌ ధ్యేయం

  • అగ్రవర్ణ పేదలకు 10 శాతం రిజర్వేషన్‌పై టీఆర్‌ఎస్‌ శ్రేణుల హర్షం
  • సీఎం చిత్రపటాలకు క్షీరాభిషేకం

బచ్చన్నపేట, జనవరి 23 : అన్నివర్గాల సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్‌ పాలన అందిస్తున్నారని రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు ఇర్రి రమణారెడ్డి అన్నారు. అగ్రవర్ణాల్లోని పేదలకు రిజర్వేషన్లలో పది శాతం కోటా కల్పించడంపై శనివారం మండల కేంద్రంలో సీఎం కేసీఆర్‌ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. అనంతరం రమణారెడ్డి మాట్లాడుతూ పేదలకు విద్యా, ఉద్యోగ అవకాశాల్లో రిజర్వేషన్‌ కల్పించడం హర్షణీయమన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు చంద్రారెడ్డి, సర్పంచ్‌ల ఫోరం మండల అధ్యక్షుడు గంగం సతీశ్‌రెడ్డి, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు కనకయ్య, సర్పంచ్‌లు మల్లారెడ్డి, బాల్‌రెడ్డి, దివ్య అరవింద్‌రెడ్డి, నాయకులు బావండ్ల కృష్ణంరాజు, చల్లా శ్రీనివాస్‌రెడ్డి, కొండి వెంకట్‌రెడ్డి, షబ్బీర్‌, కాశీపతి, జావీద్‌, నరేందర్‌, ప్రకాశ్‌, నర్సిరెడ్డి, ఫిరోజ్‌, సిద్ధ్దారెడ్డి, ప్రతాప్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

నర్మెట, తరిగొప్పులలో..

నర్మెట : అగ్రవర్ణాల్లో పేదలకు రిజర్వేషన్‌ కల్పించడంపై హర్షం వ్యక్తం చేస్తూ నర్మెట, తరిగొప్పుల మండల కేంద్రా ల్లో సీఎం కేసీఆర్‌ చిత్రపటాలకు టీఆర్‌ఎస్‌ శ్రేణులు క్షీరాభిషేకం చేశాయి.  నర్మెటలో నిర్వహించిన కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు నీరటి సుధాకర్‌, ఎంపీపీ తేజావత్‌ గోవర్ధన్‌, టీఆర్‌ఎస్‌ జిల్లా నాయకుడు పెద్ది రాజిరెడ్డి, జడ్పీ కోఆప్షన్‌ సభ్యుడు ఎండీ గౌస్‌, సర్పంచ్‌ల ఫోరం మండల అధ్యక్షుడు కమలాకర్‌రెడ్డి, వైస్‌ ఎంపీపీ మంకెన ఆగిరెడ్డి, సర్పంచ్‌లు రామిని శివరాజ్‌, బానోత్‌ శంకర్‌నాయక్‌, పగడాల విజయ నర్సయ్య, కున్సోత్‌ పావని జయరాంనాయక్‌, ఎంపీటీసీ కల్యాణం మురళి, ముక్కెర యాదమ్మ రామస్వామి,  నాయకులు కంతి రాజలింగం, పండుగ మల్లేశం, కొన్నె చంద్రయ్య, పొలెపాక తిరుపతి, బెడుదం సుధాకర్‌, గుడికందుల నరహరి తదితరులు పాల్గొన్నారు.  తరిగొప్పులలో నిర్వహించిన కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు పింగిళి జగన్మోహన్‌రెడ్డి, సర్పంచ్‌ దామెర ప్రభుదాస్‌, ఎంపీటీసీ అర్జుల మధుసూదన్‌రెడ్డి, వైస్‌ ఎంపీపీ చెన్నూరి ప్రమీల సంజీవులు, రైతుబంధు సమితి మండల కోఆర్డినేటర్‌ భూక్యా జూంలాల్‌నాయక్‌, ఉప సర్పంచ్‌ శ్రీనివాస్‌, అంకం రాజారాం, కుర్రె మ ల్లయ్య, సాయిల్ల రాజు, బూస యాదగిరి పాల్గొన్నారు. 


VIDEOS

logo