ఆదివారం 07 మార్చి 2021
Jangaon - Jan 24, 2021 , 03:34:28

అర్హులైన రైతులకు నేరుగా రుణాలు : మార్నేని

అర్హులైన రైతులకు నేరుగా రుణాలు : మార్నేని

స్టేషన్‌ఘన్‌పూర్‌/చిలుపూర్‌, జనవరి 23 : అర్హులైన రైతులకు మధ్యవర్తులతో ప్రమేయం లేకుండా సొసైటీల ద్వారా రుణాలు ఇస్తున్నట్లు డీసీసీబీ చైర్మన్‌ మార్నేని రవీందర్‌రావు అన్నారు. మండల కేంద్రంలోని సొసై టీ కార్యాలయానికి రూ.4 లక్షల వ్యయంతో నిర్మించే ప్రహరీ, చిలు పూర్‌లో రూ.35 లక్షలతో నిర్మించే గోదాం పనులకు ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యతో కలిసి శనివారం ఆయన శంకుస్థాపన చేశారు. రవీందర్‌రావు మాట్లాడుతూ సహకార బ్యాంకు ద్వారా స్వల్ప, దీర్ఘకాలిక రుణాలతో పాటు విద్య, గృహ నిర్మాణం, పాడి పరిశ్రమ అభివృద్ధికి రుణాలు ఇస్తున్నామన్నారు. ఎమ్మెల్యే రాజయ్య మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ ఆదేశాలకనుగుణంగా సహకార సంఘాల ద్వారా ప్రజలకు మరిన్ని సేవలందించేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కందుల రేఖాగట్టయ్య, సర్పంచ్‌ తాటికొండ సురేశ్‌, వైస్‌ చైర్మన్‌ నాగరాజు, సొసైటీ కార్యదర్శి, ఎంపీటీసీలు రాజు, దయాకర్‌, నర్సింహులు, వెంకటస్వామి, డైరెక్టర్లు తోట సత్యం, యాకయ్య, వెంకటయ్య పాల్గొన్నారు. చిలుపూర్‌లో నిర్వహించిన కార్యక్రమంలో సర్పంచ్‌ లింగారెడి,్డ ఎంపీటీసీ తాళ్లపల్లి ఉమ, ఎంపీపీ బొమ్మిశెట్టి సరిత, వైస్‌ ఎంపీపీ భూక్యా సరిత, పీఏసీఎస్‌ చైర్మన్‌ నరేందర్‌రెడ్డి, వైస్‌ చైర్మన్‌ నాగరాజు తదితరులు  పాల్గొన్నారు.   


VIDEOS

logo