ఆదివారం 07 మార్చి 2021
Jangaon - Jan 23, 2021 , 00:49:46

జనగామ రైల్వేస్టేషన్‌ను సందర్శించిన డీఆర్‌ఎం

జనగామ రైల్వేస్టేషన్‌ను సందర్శించిన డీఆర్‌ఎం

జనగామ టౌన్‌, జనవరి 22 : దక్షిణ మధ్య రైల్వే మేనేజర్‌ (డీఆర్‌ఎం) అభయ్‌ కుమార్‌గుప్తా జనగామ రైల్వేస్టేషన్‌ను శు క్రవారం సందర్శించారు. వరంగల్‌ నుంచి నేరుగా ఆయన యశ్వంతాపూర్‌కు చేరుకుని అక్కడ నిర్మాణంలో ఉన్న వంతెన ప పనులు పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం జనగామ రైల్వే స్టేషన్‌లో సిగ్నల్‌ పాయింట్‌, ప్రయాణికుల వెయిటింగ్‌ హాలు, టాయిలెట్స్‌, ప్లాట్‌ ఫామ్స్‌తో పాటు ఇటీవల ఏర్పాటు చేసిన ఇంగ్లిష్‌, తెలుగు, ఉర్దూ లైటింగ్‌ బోర్డులను పరిశీలించారు. ప్రయాణికుల సౌకర్యార్థం జనగామ రైల్వేస్టేషన్‌లో చార్మినార్‌ ఎక్స్‌ప్రెస్‌ను నిలిపేలా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా కౌన్సిలర్‌ మహంకాళి హరిశ్చంద్ర గుప్తాతో పాటు పలువురు డీఆర్‌ఎంకు వినతి పత్రం అందజేశారు. సికింద్రాబాద్‌ టు జనగామ వరకు ఎంఎంటీఎస్‌ రైళ్లను నడిపించాలని, ఫ్లాట్‌ ఫాంపై డిస్‌ప్లే కోచ్‌లను ఏర్పాటు చేసేలా చూడాలని వారు విజ్ఞప్తి చేశారు. డీఆర్‌ఎంను కలిసిన వారిలో స్టేషన్‌ సూపరింటెండెంట్‌ రమేశ్‌, స్టేషన్‌ మాస్టర్‌ రాజయ్య, సూపర్‌ వైజర్‌ శ్రీనివాస్‌, స్థానికులు సౌడ రమేశ్‌, లగిశెట్టి వీరలింగం, హజార్‌, షకీల్‌, ఎర్రం ప్రసాద్‌, మధు తదితరులు ఉన్నారు.


VIDEOS

logo