శుక్రవారం 05 మార్చి 2021
Jangaon - Jan 22, 2021 , 02:08:01

ఖిలాషాపురం కోటకు రూ.1.26 కోట్లు

ఖిలాషాపురం కోటకు రూ.1.26 కోట్లు

  • మరమ్మతుల కోసం నిధులు మంజూరు చేసిన సర్కారు
  • వర్షాలకు కూలిన బురుజు 
  • పునర్నిర్మాణానికి పరిపాలన అనుమతులు

జనగామ, నమస్తేతెలంగాణ, జనవరి 21 : జిల్లాలోని రఘునాథపల్లి మండలం ఖిలాషాపురం గ్రామంలో ఉన్న సర్దార్‌ సర్వాయి పాపన్న కోట బురుజు పునర్నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం రూ.1.26 కోట్లు మంజూరు చేసింది. ఈ మేరకు పనులకు సంబంధించి గురువారం సాయంత్రం పరిపాలన అనుమతులు ఇస్తూ రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక అభివృద్ధి శాఖ కార్యదర్శి కేఎస్‌.శ్రీనివాసరాజు జీవో జారీ చేశారు. కొద్దినెలల క్రితం కురిసిన భారీ వర్షాలకు ఖిలాషాపురం కోట సౌత్‌వెస్ట్‌ భాగంలోని బురుజు సగభాగం కూలిపోయింది. ఈ నేపథ్యంలో కోట బురుజు మరమ్మతు అంశాన్ని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక అభివృద్ధి శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ సీఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్లడంతో స్పందించిన ఆయన నిధుల మంజూరుకు ఆదేశాలు జారీచేశారు. ఈ మేరకు నిధులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. తెలంగాణ సంస్కృతి, వైభవాన్ని చాటేలా ఉన్న చారిత్రక ప్రాంతాలు, కట్టడాల నిర్మాణాలను కాపాడేందుకు ప్రభుత్వ కృషిని ఖిలాషాపురం గ్రామస్తులు అభినందిస్తున్నారు. 

VIDEOS

logo