27 మంది పంచాయతీ కార్యదర్శులకు పదోన్నతి

జనగామ చౌరస్తా, జనవరి 21 : జిల్లాలో 27 మంది పంచాయతీ కార్యదర్శులకు గ్రేడ్-1, గ్రేడ్-2 పంచాయతీ కార్యదర్శులుగా పదోన్నతి లభించింది. ఈ మేరకు గురువారం కలెక్టర్ నిఖిల ఉత్తర్వు లు జారీ చేశారు. గ్రేడ్-1 ప ంచాయతీ కార్యదర్శులుగా పదోన్నతి పొందినవారిలో బీ శ్రీనివాస్, బీ నరోత్తంరెడ్డి, బుస్స శ్రీనివాస్, జీ కవిత, డీ సదానందం, ఎం శశిధర్, ఆర్ సదానందం, కే జ్యోతిలత, జీ శివశంకర్, సీహెచ్ శ్యామల, ఏ నాగేశ్వరరావు, జే సురేశ్, ఏ రామారావు, ఆర్ నర్సింహం, గంట శ్రీనివాస్, గుండా చంద్రశేఖర్, డీ రాజ్‌కుమార్ ఉన్నారు. గ్రేడ్-2 పంచాయతీ కార్యదర్శులుగా కే రవీందర్, సీహెచ్ లింగయ్య, బీ సునీల్, జీ పాండు, పీ వెంకట రమణ, ఎన్ దేవేందర్, ఎం శ్రీనివాస్‌రెడ్డి, కే జ్యోతి, బీ శాంత, టీ స్వప్న పదోన్నతి పొందారు. ఈ సందర్భంగా పదోన్నతి పొందిన వారు కలెక్టర్ నిఖిలను మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ పాగాల సంపత్‌రెడ్డి, అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్, జిల్లా పంచాయతీ అధికారి రంగాచారి, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి రాంరెడ్డి, పంచాయతీ కార్యదర్శుల ఫోరం జిల్లా అధ్యక్షుడు ఆర్ శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.