మంగళవారం 02 మార్చి 2021
Jangaon - Jan 22, 2021 , 02:08:01

జీవవైవిధ్యంపై ప్రజలకు అవగాహన కల్పించాలి

జీవవైవిధ్యంపై ప్రజలకు అవగాహన కల్పించాలి

జనగామ టౌన్‌, జనవరి 21 : జీవవైవిధ్యంపై ప్రజలకు అవగాహన కల్పించడంతోపాటు పర్యావరణ పరిరక్షణపై ప్రచారం చేయాలని జీవవైవిధ్య మండలి యాజమాన్యాల కమిటీ రాష్ట్ర కార్యదర్శి కాళిచరణ్‌ఖర్గడే కోరారు. రా ష్ట్రంలోని జీవవైవిధ్య మండలి కమిటీల సమావేశం గురువారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ సమావేశానికి జనగామ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పోకల జమున హాజరయ్యారు. కాళిచరణ్‌ మాట్లాడుతూ జీవవైవిధ్య యాజమాన్య కమిటీలు తమ పరిధిలోని ప్రకృతి వనరుల వినియోగాన్ని గమనించాలని సూచించారు. ఈ విషయంలో జనగామ కమిటీ ప్రణాళికాబద్దం గా పనిచేస్తున్నతీరును ఆయన అభినందించా రు. పట్టణాలు, గ్రామాల్లోని ముఖ్యకూడళ్లలో జీవవైవిధ్యంపై ఆకర్షణీయంగా పెయింటింగ్స్‌ వేయించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు పానుగంటి ప్రవీ ణ్‌కుమార్‌, కృష్ణ పాల్గొన్నారు.


VIDEOS

తాజావార్తలు


logo