శుక్రవారం 05 మార్చి 2021
Jangaon - Jan 21, 2021 , 02:05:50

ప్రతి రోజూ భగీరథ నీరందించాలి

ప్రతి రోజూ భగీరథ నీరందించాలి

దేవరుప్పుల, జనవరి 20: ప్రతి రోజూ భగీరథ నీరందించాలని రామరాజుపల్లి గ్రామస్తులు గ్రామసభలో డిమాండ్‌ చేశారు. బుధవారం గ్రామంలోని పల్లె ప్రకృతి వనం, శ్మశాన వాటిక, తడి, పొడి చెత్తను వేరు చేసే కేంద్రం, నర్సరీలను అధికారులు పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం సర్పంచ్‌ బండి స్నేహ అధ్యక్షతన జరిగిన గ్రామసభలో ప్రత్యేకాధికారి కొండల్‌రెడ్డి, ఎంపీడీవో ఉమామహేశ్వర్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ.. ట్యాంకులో భగీరథ నీటితో పాటు స్థానిక బోరు నీటిని నింపుతున్నారన్నారు. దీంతో ఆర్‌డబ్ల్యూఎస్‌ ఏఈ మానసను ప్రత్యేకాధికారి వివరణ కోరగా ఇక నుంచి భగీరథ నీరు అందేలా చూస్తామని తెలిపారు. కార్యక్రమంలో పీఆర్‌ ఏఈ సతీశ్‌, సెక్రటరీ సందీప్‌రెడ్డి, ఉపసర్పంచ్‌ నాగరాజు, ఉపాధిహామీ టీఏ వెంకట్‌ పాల్గొన్నారు.

VIDEOS

logo