శనివారం 27 ఫిబ్రవరి 2021
Jangaon - Jan 21, 2021 , 02:05:50

రోడ్డు ప్రమాదాల నివారణకు కృషి చేయాలి : ఏసీపీ

రోడ్డు ప్రమాదాల నివారణకు కృషి చేయాలి : ఏసీపీ

జనగామ చౌరస్తా, జనవరి 20 : రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఏసీపీ వినోద్‌కుమార్‌ అన్నారు. 32వ జాతీ య రోడ్డు భద్రత మాసోత్సవాల్లో భాగంగా బుధవారం జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేష న్‌ నుంచి అంబేద్కర్‌ చౌరస్తా వరకు నిర్వహించిన ఆటో ర్యాలీని ఏసీపీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆటోడ్రైవర్లు ప్రభుత్వ నిబంధనలు పాటించాలన్నారు. వాహనాల వేగాన్ని అదుపు చేయడానికి స్పీడ్‌, లేజర్‌ గన్స్‌ వినియోగిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో అర్బన్‌ సీఐ మల్లేశ్‌యాదవ్‌, ఎంవీఐ శోభన్‌బాబు పాల్గొన్నారు.

VIDEOS

logo