మంగళవారం 09 మార్చి 2021
Jangaon - Jan 21, 2021 , 02:05:48

సర్పంచ్‌ అవినీతిపై విచారణ

సర్పంచ్‌  అవినీతిపై  విచారణ

రఘునాథపల్లి, జనవరి 20: రఘునాథపల్లి సర్పం చ్‌ పోకల శివకుమార్‌పై అందిన ఫిర్యాదు నేపథ్యం లో డీపీవో రంగాచారి బుధవారం విచారణ చేపట్టారు. గ్రామ కంఠంలో అక్రమంగా మూడంతస్తుల ఇల్లు నిర్మించుకోవడంతో పాటు గ్రామ పంచాయతీ తీర్మానం, వార్డు సభ్యుల ఆమోదం లేకుండా ఇష్టారాజ్యంగా పనులు చేపడుతూ నిధుల దుర్వినియోగానికి పాల్పడుతున్నాడని ఈనెల 11న తొమ్మిది మంది వార్డు సభ్యులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో కలెక్టర్‌ నిఖిల ఆదేశాల మేరకు డీపీవో రంగాచారి, డీఎల్‌పీవో గంగాభవాని స్థానిక పంచాయతీ కార్యాలయంలో బుధవారం పలు రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. 


VIDEOS

logo