ఆదివారం 07 మార్చి 2021
Jangaon - Jan 20, 2021 , 00:26:52

కొడకండ్లలో నిట్‌ ప్రొఫెసర్ల బృందం పర్యటన

కొడకండ్లలో నిట్‌ ప్రొఫెసర్ల బృందం పర్యటన

కొడకండ్ల, జనవరి 19 : మండల కేంద్రం నుంచి నాంచారిమడూరు, పాలకుర్తి వెళ్లే రహదారుల్లో బయన్న వాగుపై హైలెవల్‌ వంతెన ప్రతిపాదనలను డీసీసీబీ వైస్‌ చైర్మన్‌ కుందూరు వెంకటేశ్వర్‌రెడ్డి నేతృత్వంలో మంగళవారం నిట్‌ ప్రొఫెసర్ల బృందం పరిశీలించింది. గతంలో నిర్మించిన వంతెనను పరిశీలించి ఆధునిక పద్ధతుల్లో నిర్మించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రొఫెసర్లు ప్రతిపాదనలు చేశారు. వాగుపై వంతెన నిర్మాణానికి అనుమతులను త్వరగా వచ్చేలా మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు దృష్టికి తీసుకెళ్తామని ప్రజాప్రతినిధులు తెలిపారు. ఈ కార్యక్రమంలో కొడకండ్ల మార్కెట్‌ చైర్మన్‌ పేరం రాము, ఎంపీపీ జ్యోతి రవీంద్ర గాంధీనాయక్‌, జడ్పీటీసీ కేలోత్‌ సత్తెమ్మ, సర్పంచ్‌ పసునూరి మధుసూదన్‌, రైతుబంధుసమితి జిల్లా సభ్యుడు సిందె రామోజీ, ఎంపీటీసీలు అందె యాకయ్య, కుందూరు విజయలక్ష్మి, మార్కెట్‌ కమిటీ డైరెక్టర్‌ దూలం సతీశ్‌, ఉప సర్పంచ్‌ బోయిని రమేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

VIDEOS

logo