పల్లెలు అభివృద్ధిలో దూసుకుపోవాలి

- ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేయాలి
- ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి
- పార్టీ శ్రేణులకు మంత్రి ఎర్రబెల్లి దిశానిర్దేశం
పాలకుర్తి రూరల్ జనవరి 18: ‘పల్లెలు అభివృ ద్ధిలో దూసుకుపోవాలి.. నియోజకవర్గంలోని ప్ర జాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పని చేయాలి’ అని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని మంత్రి క్యాంప్ కార్యాల యంలో దేవరుప్పుల మండలంలోని పలు గ్రా మాలకు సంబంధించిన అభివృద్ధి పనులపై ప్రజా ప్రతినిధులు, పార్టీ శ్రేణులు, అధికారులతో కలిసి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు మాట్లాడుతూ పల్లె ప్రగతి తో గ్రామాలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాయ న్నారు. కల్యాణలక్ష్మి, కేసీఆర్ కిట్, షాదీ ముబార క్ వంటి పథకాలను ప్రవేశ పెట్టామన్నారు. మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ నల్లానీరు అందిస్తున్నా మన్నారు. త్వరలో తొర్రూరు కేంద్రంగా నిరుద్యో గ యువతకు రెండునెలలు ఉచిత కోచింగ్ ఇవ్వ నున్నట్లు చెప్పారు. తండాలను గ్రామ పంచాయ తీలుగా మార్చిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కింద న్నారు. ఎస్సీ ఎస్టీ మైనారిటీ రిజర్వేషన్లపై అసెంబ్లీ తీర్మానాలు చేసి పంపినా కేంద్రం పార్లమెంట్లో ఆమోదించ లేదన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకా లు, అభివృద్ధి పనులను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. కేంద్రప్రభుత్వం రైతు వ్యతిరేక వి ధానాలను అవలంబిస్తోందన్నారు. పల్లె ప్రగతి పనులను వేగంగా పూర్తి చేయాలని సూచిం చారు. టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు తీగల దయాకర్, ఎంపీపీ బస్వ సావిత్రీమల్లేశం, ఎంపీపీ నల్లా నాగి రెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పసునూరి నవీన్, జడ్పీటీసీ పల్ల భార్గవీసుందర్రామిరెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ లింగాల రమేశ్‌రెడ్డి, వంగ అర్జున్ గౌడ్, విక్రమ్‌రెడ్డి, కుర్నాల రవి, గోడుగు మల్లికా ర్జున్, మైసారావు, కొత్త జలేంధర్ రెడ్డి, కోతి పద్మ, పీఆర్ ఓఎస్డీ రవీందర్రావు, ఈఈ రఘువీరారెడ్డి, డీఈ దిలీప్‌కుమార్, ఏఈ సతీశ్‌కుమార్, ఆర్డ బ్ల్యూఎస్ డీఈ సంధ్యారాణి, ఏఈ మానస, ఏపీడీ ఎండీ నూరొద్దీన్, డీఎల్పీవో గంగాభవాని, స్త్రీనిధి ఆర్ఎం పూర్ణచందర్రావు పాల్గొన్నారు.