మంగళవారం 02 మార్చి 2021
Jangaon - Jan 19, 2021 , 01:01:24

అధికారుల గైర్హాజరుపై సభ్యుల ఆగ్రహం

అధికారుల గైర్హాజరుపై సభ్యుల ఆగ్రహం

  • సమస్యలు పట్టని తీరుపై 
  • పలువురు జడ్పీటీసీల నిరసన
  • జడ్పీ సర్వసభ్య  వాయిదా

జనగామ, నమస్తే తెలంగాణ జనవరి 18 : జిల్లా పరిషత్‌ సర్వసభ్య సమావేశం వాయిదా పడింది. సోమవారం జడ్పీ చైర్మన్‌ పాగాల సంపత్‌రెడ్డి అధ్యక్షతన ప్రా రంభమైన సభకు కలెక్టర్‌, అదనపు కలెక్టర్‌తోపాటు వివిధ ప్రభుత్వశాఖల జిల్లా అధికారులు గైర్హాజరవడంతో ఆగ్రహించిన పలువురు జడ్పీటీసీ సభ్యులు సభ నుంచి వాకౌట్‌ చేశారు. ఈ నేపథ్యంలో చాంబర్‌లో కూర్చున్న సభ్యులకు నచ్చజెప్పి సభను నిర్వహించేందుకు చైర్మన్‌ సంపత్‌రెడ్డి ప్రయత్నించినా ఫలితం లేకపోవడంతో సమావేశాన్ని వాయిదా వేశారు. ఈ సందర్భంగా పలువురు సభ్యులు మాట్లాడుతూ జిల్లా ప్రజాప్రతినిధులు హాజరయ్యే కీలకమైన జడ్పీ సమావేశానికి కలెక్టర్‌, అదనపు కలెక్టర్‌తోపాటు ప్రధాన శాఖల జిల్లా అధికారులు సైతం రాకపోవడంతో తమ సమస్యలు ఎవరికి చెప్పుకోవాలి? ఎవరు తీరుస్తారని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామాల్లో పర్యటించినప్పుడు సర్పంచ్‌లు, ఎంపీటీసీలతోపాటు ప్రజలు అనేక సమస్యలను తమ దృష్టికి తెస్తున్నారని, వాటిని జడ్పీ సమావేశంలో ప్రస్తావించి పరిష్కరించుకుందామంటే అధికారులు రాకపోవడం తో టైంపాస్‌ కోసం సమావేశానికి వచ్చినట్లుందని ఎద్దేవా చేశారు. సభ్యులు ప్రస్తావించే సమస్యలపై నిర్లక్ష్యం వహిస్తున్న సంబంధిత అధికారులపై ప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తామని పలువురు పేర్కొన్నారు. క్షేత్రస్థాయిలో ఉండే తమకు ప్రజల కష్టాలు, సమస్యలు తెలుసని వాటిని పరిష్కరించుకునే అవకాశమున్నా సమావేశానికి అధికారులు రాకుంటే ఎలా అని ప్రశ్నించారు. 

జడ్పీటీసీల ఫోరం జిల్లా అధ్యక్షుడిగా మణికంఠ అజయ్‌

జడ్పీటీసీల ఫోరం జిల్లా అధ్యక్షుడిగా రఘునాథపల్లి జడ్పీటీసీ బొల్లం మణికంఠ అజయ్‌ ఎన్నికయ్యారు. సోమవారం జడ్పీ చైర్మన్‌ సంపత్‌రెడ్డి ఆధ్వర్యంలో సమావేశమైన సభ్యులు, కోఆప్షన్‌ సభ్యు లు మణికంఠ అజయ్‌ని ఫోరం అధ్యక్షుడిగా ఎన్నుకున్నట్లు ప్రకటించారు. అనంతరం అజయ్‌ని జడ్పీ చైర్మన్‌తోపాటు జడ్పీటీసీలు, కోఆప్షన్‌ సభ్యులు అభినందించారు. 


VIDEOS

logo