శనివారం 06 మార్చి 2021
Jangaon - Jan 19, 2021 , 01:01:28

రామమందిర నిర్మాణంలో భాగస్వాములు కావాలి : ఎర్రబెల్లి

 రామమందిర నిర్మాణంలో భాగస్వాములు కావాలి : ఎర్రబెల్లి

పాలకుర్తి/పాలకుర్తి రూరల్‌, జనవరి18: అయోధ్యలో శ్రీరామమందిర నిర్మాణానికి అందరూ తోచిన సహాయాన్ని అందించాలని రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పిలుపునిచ్చారు. సోమవారం మండల కేంద్రంలోని మం త్రి క్యాంపు కార్యాలయంలో శ్రీరా మ జన్మభూమి తీర్థక్షేత్ర మందిర నిర్మాణ సమితి ఆధ్వర్యంలో ఎర్రబెల్లిని కలిసి విరాళాలు సేకరించారు. ఎర్రబెల్లి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మందిర నిర్మాణానికి తమవంతు సాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సమితి అధ్యక్షుడు ముచాల రవీందర్‌, సిద్ధయ్య, ప్రభాకర్‌రాజు, గొట్టిముక్కల సుధాకర్‌రెడ్డి, ఇమ్మ డి దామోదర్‌, తాళ్ల సోమనారాయణ, గజ్జి సంతోష్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు. 

దశదిన కర్మకు హాజరైన మంత్రి ఎర్రబెల్లి

 పాలకుర్తికి చెందిన వీరమనేని తారమ్మ ఇటీవల మరణించగా సోమవారం నిర్వహించిన దశదిన కర్మకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు హాజరై నివాళులర్పించారు. మంత్రి వెంట తారమ్మ కుమారుడు వీరమనేని వెంకటేశ్వర్‌రావు, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు పసునూరి నవీన్‌, సర్పంచ్‌ వీరమనేని యాకాంతారావు, నాగన్న, వర్రె వెంకన్న, పన్నీరు సమ్మయ్య, రాపాక విజయ్‌, పాపారావు ఉన్నారు.

VIDEOS

logo