సోమవారం 01 మార్చి 2021
Jangaon - Jan 18, 2021 , 05:34:20

చెక్‌డ్యాం మంజూరు చేయాలని వినతి

చెక్‌డ్యాం మంజూరు చేయాలని వినతి

దేవరుప్పుల, జనవరి 17: దేవరుప్పుల మండలంలో ప్రవహిస్తున్న యశ్వంతాపూర్‌ వాగుపై మన్‌పహాడ్‌ వద్ద చెక్‌డ్యాం మంజూరు చేయాలని కోరుతూ సర్పంచ్‌ వర్రె మధుయాదవ్‌ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుకు వినతి పత్రం అందజేశారు. పాలకుర్తిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆదివారం సాయంత్రం మంత్రిని కలిసిన ఆయన మన్‌పహాడ్‌  ప్రాంతంలో భూగర్భ జలాలు పెరుగాలంటే వాగుపై చెక్‌డ్యాం నిర్మించాల్సిన అవసరం ఉందని వివరించారు. ఆయన వెంట టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు తీగల దయాకర్‌ తదితరులు ఉన్నారు.


VIDEOS

logo