ఆదివారం 07 మార్చి 2021
Jangaon - Jan 18, 2021 , 05:33:34

క్రీడలపై యువత మక్కువ పెంచుకోవాలి

క్రీడలపై యువత మక్కువ పెంచుకోవాలి

జనగామ టౌన్‌, జనవరి 17: క్రీడలపై యువత మక్కువ పెంచుకోవాలని ఏసీపీ వినోద్‌ కుమార్‌ అన్నారు.  కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం జనగామ జిల్లా ప్రధాన కార్యదర్శి బొట్ల శేఖర్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రికెట్‌ టోర్నమెంట్‌లో ధర్మకంచ కింగ్స్‌ జట్టు గెలుపొందగా ఏసీపీ చేతుల మీదుగా ఆదివారం బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ బాల్దె విజయ సిద్దిలింగం, 13వ వార్డు కౌన్సిలర్‌ మల్లిగారి చంద్రకళ, మాజీ కౌన్సిలర్‌ మేడ శ్రీనివాస్‌, మార్కెట్‌ కమిటీ మాజీ డైరెక్టర్‌ ఉడుగుల నర్సింహులు, అంబేద్కర్‌ సంఘం డివిజన్‌ అధ్యక్షుడు మిద్దెపాక స్టాలిన్‌, పట్టణ అధ్యక్షుడు ఉడుగుల సాగర్‌, టీఆర్‌ఎస్‌ నాయకురాలు మేడ గంగా పాల్గొన్నారు.


VIDEOS

logo