ఆదివారం 28 ఫిబ్రవరి 2021
Jangaon - Jan 18, 2021 , 05:32:49

క్రికెట్‌ పోటీలు ప్రారంభం

క్రికెట్‌ పోటీలు ప్రారంభం

స్టేషన్‌ ఘన్‌పూర్‌, జనవరి 17: విశ్వనాథపురం గ్రామంలో ఉమ్మడి వరంగల్‌ జిల్లా స్థాయి క్రికెట్‌ పోటీలను టీఆర్‌ఎస్‌ జిల్లా నాయకుడు, రైస్‌ మిల్లర్ల అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడు బెలిదె వెంకన్న ఆదివారం ప్రారంభించారు. మాన్సింగ్‌ తండాకు చెందిన సేవాలాల్‌ ప్రీమియర్‌ లీగ్‌ ఉమ్మడి వరంగల్‌ జిల్లా స్థాయి పోటీల్లో మొదటి రోజు రాంపూర్‌, మాన్సింగ్‌ తండాకు చెందిన జట్లు పాల్గొన్నాయి. కార్యక్రమంలో బూర్ల శంకర్‌, విశ్వనాథపురం సర్పంచ్‌ అనుమాల మల్లేశం, చంద్రు తండా సర్పంచ్‌ భూక్యా రాజు నాయక్‌, ఉప సర్పంచ్‌ భూక్యా మేనకా చరణ్‌, ఎంపీటీసీ మాలోత్‌ లలితా శ్రీనివాస్‌, పూండ్రు నవీన్‌రెడ్డి, దుంపుల సురేశ్‌, స్టేషన్‌ఘన్‌పూర్‌ నియోజకవర్గ యూత్‌ ఇన్‌చార్జి గణేశ్‌ పాల్గొన్నారు.


VIDEOS

logo