శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
Jangaon - Jan 18, 2021 , 05:28:19

నర్సరీల్లోని ప్రతి మొక్కనూ కాపాడాలి

నర్సరీల్లోని ప్రతి మొక్కనూ కాపాడాలి

జనగామ రూరల్‌, జనవరి17: నర్సరీల్లో పెంచుతున్న ప్రతి మొక్కనూ కాపాడాలని డీఆర్డీవో గూడూరు రాంరెడ్డి అన్నారు. ఆదివారం మండలంలోని చీటకోడూర్‌, మరిగడి, చౌడారం గ్రామాల్లో పల్లె ప్రగతిలో చేపట్టిన శ్మాశన వాటిక, నర్సరీలను పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ పల్లె ప్రగతిలో చేపట్టిన పనులు పూర్తి చేయాలని, వచ్చే హరితహారం కార్యక్రమానికి మొక్కలను సిద్ధం చేయాలని, విత్తనాలు నాటి ప్రతిరోజూ నీరు పట్టాలని సూచించారు. నర్సరీల్లో పెంచుతున్న మొక్కలు ఎండిపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. పూలమొక్కలు, పండ్ల మొక్కలు, నీడనిచ్చే మొక్కలు పెంచాలని అధికారులు, ప్రజాప్రతినిధులకు సూచించారు. ఈనెలలో మొక్కల పెంపకం పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో సర్పంచ్‌లు కొత్త దీపక్‌రెడ్డి, రజిత, రాజయ్య, టీఏ అనిల్‌, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.

VIDEOS

logo