మంగళవారం 09 మార్చి 2021
Jangaon - Jan 17, 2021 , 00:35:09

జనగామ బస్టాండ్‌, రైల్వేస్టేషన్‌లో పేదలకు అన్నదానం

జనగామ బస్టాండ్‌, రైల్వేస్టేషన్‌లో పేదలకు అన్నదానం

జనగామ టౌన్‌, జనవరి 16 : టీఆర్‌ఎస్‌ జనగామ నియోజకవర్గ కో-ఆర్డినేటర్‌ గుజ్జ సంపత్‌ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని అమ్మ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో కౌన్సిలర్‌ కర్రె శ్రీనివాస్‌ శనివారం స్థానిక రైల్వే స్టేషన్‌, బస్టాండ్‌ పరిసర ప్రాంతాల్లో నిరాశ్రయులకు అన్నదానం చేశారు. ఈ సందర్భంగా కర్రె శ్రీనివాస్‌ మాట్లాడుతూ నియోజకవర్గంలో పార్టీ శ్రేణులకు, కార్యకర్తలకు అందుబాటులో ఉంటున్న నాయకుడు గుజ్జ సంపత్‌రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో అమ్మ ఫౌండేషన్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మంతెన మణి, సలహాదారుడు వంగ భీమ్‌రాజ్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు ఉడుగుల నర్సింహులు, మిద్దెపాక లెనిన్‌, ఎండీ అన్వర్‌, తుంగ కౌశిక్‌, అంబాల శివ తదితరులు పాల్గొన్నారు.

VIDEOS

logo