శనివారం 27 ఫిబ్రవరి 2021
Jangaon - Jan 16, 2021 , 01:57:48

కరోనా వారియర్స్‌కు నేడు వ్యాక్సినేషన్‌

కరోనా వారియర్స్‌కు నేడు వ్యాక్సినేషన్‌

  •  నేడు జనగామ, పాలకుర్తి దవాఖానల్లో వైద్యులకు టీకా
  • హాజరుకానున్న మంత్రి ఎర్రబెల్లి

జనగామ, నమస్తే తెలంగాణ/స్టేషన్‌ఘన్‌పూర్‌/ పాలకుర్తిరూరల్‌, జనవరి 15: దవాఖానల్లో కొవిడ్‌ రోగులకు సేవలందించిన వైద్యులు, పారా మెడికల్‌ సిబ్బందితోపాటు కష్టకాలంలో సేవలందించిన పారిశుధ్య కార్మికులకు తొలి కరోనా టీకాను ఇవ్వాలని స ర్కారు నిర్ణయించింది. వీరి  తర్వాత వైద్య సిబ్బంది, ఇతర కరోనా వారియర్స్‌కు టీకా వేయనున్నారు. ఈనెల 16న జిల్లా కేంద్రంలోని ప్రధాన దవాఖానతోపాటు పాలకుర్తిలోని పీహెచ్‌సీలో 30 మందికి చొప్పు న మొత్తం 60 మందికి టీకా వేసే కార్యక్రమాన్ని రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, కలెక్టర్‌ నిఖిల ప్రారంభించనున్నారు. జిల్లాలోని మొ త్తం 3700 మంది ప్రభుత్వ, ప్రైవేట్‌ వైద్య సిబ్బంది, కరోనా వారియర్లకు టీకాలు అందించేందుకు వైద్యారోగ్యశాఖ ఏర్పాట్లు చేసింది. మొదటి దశలో వీరికి టీకా ఇచ్చిన తర్వాత సైడ్‌ ఎఫెక్ట్‌ సమస్యలను పర్యవేక్షించేందుకు వైద్యశాఖ స్వల్పమార్పులు చేసింది. మొదటి రోజు ఒక్కో కేంద్రంలో 30 మందికి టీకా వేసి ఆ తర్వాత దశల వారీగా రోజుకు 50 నుంచి 100 మందికి టీకా వేసే కేంద్రాలు, వేయించుకునే వారి సంఖ్యను పెంచుకుంటూ పోతారు. మొదటివారంలో సమస్యలు రాకుంటే రెండోవారం నుంచి ప్రైవేట్‌ కేంద్రాల్లో టీకాలను పంపిణీ చేయాలని అధికారులు నిర్ణయించారు. ఇప్పటికే జిల్లాలోని కోల్డ్‌చైన్‌ పాయింట్లకు వ్యాక్సిన్‌ చేరుకుంది. 830 మందికి వ్యాక్సిన్‌ ఇచ్చే సా మర్థ్యం కలిగిన 83 వాయిల్స్‌ను సిద్ధం చేశారు. రెండువారాల్లో మొత్తం ప్రక్రియను పూర్తిచేసిన తర్వాత నాలుగు ను ంచి ఆరు వారాల అనంతరం రెండో డోసు వేయనున్నారు. 

జిల్లాలో 3700 మందికి టీకా : డీఎంహెచ్‌వో

 జిల్లాలో 3700 మంది వైద్య సిబ్బందికి కరోనా వ్యాక్సిన్‌ ఇవ్వనున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్‌ మహేందర్‌ తెలిపారు. శుక్రవారం ఆయన పాలకుర్తిలోని దవాఖానను సందర్శించిన అనంతరం మాట్లాడారు. రెండు వారాల్లో ఈ ప్రక్రియ పూర్తి చేశాక నాలుగు నుంచి ఆరు వారాల్లో రెండో డోస్‌ వేస్తామన్నారు. ఆయన వెంట ఎంపీపీ నల్లా నాగిరెడ్డి, డాక్టర్‌ ప్రియాంక, సర్పంచ్‌ వీరమనేని యాకాంతారావు, జడ్పీ కో ఆప్షన్‌ సభ్యుడు ఎండీ మదార్‌, వెంకటేశ్వర్లు, చందర్‌, మంజులారాణి  ఉన్నారు. 

18 నుంచి మండలాల్లో వ్యాక్సినేషన్‌ : రాజయ్య

ఈ నెల 18 నుంచి మండల కేంద్రాల్లోని దవాఖానల్లో వైద్య సిబ్బందికి కరోనా వ్యాక్సిన్‌ ఇస్తారని స్టేషన్‌ ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య తెలిపారు. శుక్రవారం స్టేషన్‌ఘన్‌పూర్‌లోని మండల పరిషత్‌ కార్యాలయంలో ఎంపీపీ కందుల రేఖాగట్టయ్య అధ్యక్షతన నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. మొదటి విడుతలో మండలంలో 284 మందికి, అనంతరం మిగిలిన వారికి వ్యాక్సిన్‌ ఇస్తారని చెప్పారు. ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేకాధికారి భిక్షపతి,ఎంపీడీవో కుమారస్వామి, డాక్టర్‌ శ్రీవాణి, డాక్టర్‌ రవి రాథోడ్‌, హెల్త్‌ సూపర్‌వైజర్‌ జమాలొద్దీన్‌, ‘కూడా’ డైరెక్టర్‌ ఆకుల కుమార్‌, ఎంపీవో మహబూబ్‌అలీ తదితరులు పాల్గొన్నారు.


VIDEOS

logo