ఆదివారం 28 ఫిబ్రవరి 2021
Jangaon - Jan 16, 2021 , 01:57:48

ఇంటింటా రంగవల్లులు.. ఊరూరా ఆటల పోటీలు

ఇంటింటా రంగవల్లులు.. ఊరూరా ఆటల పోటీలు

  • ఉత్సాహంగా  సంబురాలు

దేవరుప్పుల, జనవరి 15 : సంక్రాంతి పండుగ సంబురాలు అంబరాన్నంటాయి. గ్రామాల్లో ఇంటిం టా రంగురంగుల రంగవల్లులు, గంగిరెద్దుల ఆటలు, హరిదాసుల కీర్తనలతో సందడి కనిపించింది. దేవరుప్పుల గ్రామపంచాయతీ ఎదుట ముగ్గుల పోటీలు నిర్వహించారు. రాజారాం ట్రస్టు ఆధ్వర్యంలో ఆయన కుటుంబ సభ్యులు రాములమ్మ, అన్నాంబిక, రంజిత్‌, ప్రమద ముగ్గుల పోటీ విజేతలకు బహుమతులు అందించారు. రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీల్లో విజేతలకు లయన్స్‌క్లబ్‌ అధ్యక్ష,కార్యదర్శులు గోలి ఉప్పల్‌రెడ్డి, బూత్కూరు అశోక్‌రెడ్డి బహుమతులు అందజేశారు. మన్‌పహాడ్‌లో క్రికెట్‌ పోటీల విజేతలకు  ప్రభుత్వ ఉద్యోగులు బహుమతులు సమకూర్చగా సర్పంచ్‌ వర్రె మధు అందించారు. చినమడూరులో వేణుగోపాల స్వామి కల్యాణం నిర్వహించి శోభాయాత్ర కొనసాగించారు. బంజరలో మల్లన్న జాతర జరుగగా భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై మొక్కులు తీర్చుకున్నారు.   

నర్మెట, తరిగొప్పులలో..

నర్మెట, తరిగొప్పుల(నర్మెట) : నర్మెట, తరిగొప్పుల మండలాల్లో సంక్రాంతి సంబురాలు అంబరాన్నంటాయి. నర్మెట, తరిగొప్పుల, నర్సాపూర్‌ గ్రామాల్లో భక్తులు ఎడ్లబం డ్లు, వాహనాలతో దేవాలయాల చుట్టూ ప్రదక్షిణలు నిర్వ హించారు. కార్యక్రమంలో సర్పంచ్‌లు ఆమెడపు కమలా కర్‌రెడ్డి, దామెర ప్రభుదాస్‌, బెల్లపు రాజు పాల్గొన్నారు. 

స్టేషన్‌ఘన్‌పూర్‌లో..

స్టేషన్‌ ఘన్‌పూర్‌ :  మండల కేంధ్రంలోని మా గార్డెన్‌లో స్పోర్ట్స్‌ అండ్‌ కల్చరల్‌ క్లబ్‌ అధ్యక్షుడు అక్కినపల్లి అంజయ్య నేతృత్వంలో నిర్వహించిన కార్యక్రమంలో ముగ్గుల పోటీ విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా సీఐ శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ కంప్యూటర్‌ యుగంలో విద్యతోపాటు మన సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవాలన్నారు. ఇప్పటి జనరేషన్‌కు చదువు, సెల్‌ఫోన్‌ తప్ప మరోటి తెలియడం లేదన్నారు. ఈ కార్యక్రమంలో క్లబ్‌ కార్యదర్శి అంబటి కిషన్‌ రాజు, స్పోర్ట్స్‌ కన్వీనర్‌ పెసరు సారయ్య, కల్చరర్‌ కన్వీనర్‌ మల్లేశం, గౌరవ సలహాదారులు ఖాజామొయినొద్దీన్‌, ఉపేందర్‌, యంజాల ప్రభాకర్‌, గోలి రాజశేఖర్‌, బహుమతుల దాత శ్రీకాంత్‌, గన్ను కార్త్తీక్‌, గట్టు రమేశ్‌, గజ్జెల్లి రాజు, యాకూబ్‌ పాషా, చంద్రశేఖర్‌రెడ్డి పాల్గొన్నారు.

ఎమ్మెల్యే రాజయ్య శుభాకాంక్షలు

స్టేషన్‌ఘన్‌పూర్‌టౌన్‌ : సంక్రాంతి పండుగ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్‌ తాటికొండ రాజయ్యతోపాటు జడ్పీ స్టాండింగ్‌ కమిటీ చైర్మన్‌ మారపాక రవి, కుడా డైరెక్టర్‌ ఆకుల కుమార్‌, సర్పంచ్‌ల ఫోరం మండల అధ్యక్షుడు సురేశ్‌కుమార్‌ స్టేషన్‌ఘన్‌పూర్‌, శివునిపల్లి పట్టణాల ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఇదిలా ఉండగా పండుగ సంద ర్భంగా ఆకర్షణీయంగా ముగ్గులు వేసిన 15 మంది మహిళలకు లయన్స్‌క్లబ్‌ మండల అధ్యక్షుడు మహ్మద్‌ దస్తగిరి తదితరులు పాల్గొని బహుమతులు అందజేశారు.

VIDEOS

logo