సీఎం కేసీఆర్ జోలికి వస్తే ఖబడ్దార్

- ఎంపీ బండి సంజయ్‌పై జడ్పీ అధ్యక్షులు
- సుధీర్‌కుమార్, సంపత్‌రెడ్డి ధ్వజం
జనగామ, నమస్తే తెలంగాణ, జనవరి 15 : ‘ప్రాణాలను ఫణంగా పెట్టి సాధించుకున్న తెలంగాణను అన్నిరంగాల్లో అభివృద్ధి చేస్తున్న సీఎం కేసీఆర్ జోలికి వస్తే ఊరుకోం.. బండి సంజయ్ ఖబడ్దార్” అంటూ వరంగల్ అర్బన్, జనగామ జడ్పీ చైర్మన్లు మారపల్లి సుధీర్‌కుమార్, పాగాల సంపత్‌రెడ్డి హెచ్చరించారు. శుక్రవారం జనగామలోని ఆర్అండ్బీ అతిథి గృహంలో మున్సిపల్ చైర్పర్సన్ పోకల జమున, గిరిజన సహకార సంస్థ రాష్ట్ర మాజీ చైర్మన్ ధరావత్ గాంధీనాయక్, ఎంపీపీ మేకల కళింగరాజు, రఘునాథపల్లి జడ్పీటీసీ మణికంఠ అజయ్, పీఏసీఎస్ చైర్మన్ మహేందర్‌రెడ్డి, కౌన్సిలర్ పీఆర్ సుధా సుగుణాకర్రాజుతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. దిగజారుడు రాజకీయాలకు తెరతీస్తూ కార్యకర్తలను రెచ్చగొట్టేలా వ్యాఖ్య లు చేస్తూ ప్రభుత్వ కార్యాలయాలు, అధికారులపై దాడులకు ప్రోత్సహిస్తూ ఘర్షణలు చెలరేగేలా బీజేపీ కుట్ర పన్నుతున్నదని మండిపడ్డారు. బండి సంజయ్ రాష్ట్ర అభివృద్ధిపై మాట్లాడే ముందు దేశంలోని బీజేపీ పాలిత రాష్ర్టాల్లో తెలంగాణ తరహా ప్రగతితో సరిపోల్చుకోవాలని సూచించారు. చట్టవ్యతిరేకంగా సెంట్రల్పోల్స్కు కట్టిన ఫ్లెక్సీలను డీఎంఏ పర్యటన సందర్భంగా నిబంధనల ప్రకారం తొలగించిన మున్సిపల్ కమిషనర్‌ను దళితుడనే చులకన భావంతో కించపరిచారని, విధులను అడ్డుకున్న వారిని మందలించాల్సిన హోదా లో ఉన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు తన స్థాయిని తగ్గించుకునేలా చిన్న అంశాన్ని పెద్దగా చేసి చిల్లరమల్లర రాజకీయాల కోసం జనగామలో కల్లోలం సృష్టించేందుకు ప్రయత్నించి, తప్పును కప్పిపుచ్చుకునేందుకు నెపాన్ని స్థానిక ఎమ్మెల్యేపై రుద్దాలని చూశారని మండిపడ్డారు. అనుమతి లేకుండా డీసీపీ కార్యాలయాన్ని ముట్టిడించి గేటు ఎక్కి లోపలికి చొరబడి రాష్ట్ర నేత సాక్షిగా బీజేపీ విధ్వంసం చేసేందుకు ప్రయత్నించడాన్ని చైతన్యవంతులైన ప్రజలు గమనిస్తున్నారన్నారు. కేసీఆర్‌పై విమర్శలు చేయడం ద్వారా బడానేతలుగా చెలామణి అవుదామని కలలుగంటున్న బీజేపీకి భంగపాటు తప్పదన్నారు.
తాజావార్తలు
- రాష్ట్రంలో 40 డిగ్రీలకు చేరువలో ఎండలు
- 28-02-2021 ఆదివారం.. మీ రాశి ఫలాలు
- షీ టీమ్స్ ఆధ్వర్యంలో భారీ జాబ్ మేళా నిరుద్యోగులకు.. కొలువులు
- అతివేగం.. ప్రాణం తీసింది
- మెరుగైన సేవలకు.. చేతులు కలపండి
- పారిశ్రామిక పురోభివృద్ధిలో మేడ్చల్
- సఫారీ టూర్.. మరింత కొత్తగా
- హైదరాబాద్ స్టార్టప్‌కు ఇన్నోవేషన్ ఎక్స్‌ప్రెస్ అవార్డు
- రూ.60 లకు తిన్నంత బిర్యానీ
- మనకు కావాల్సింది నిమిషాల్లో తెచ్చిస్తారు