మానవతావాది మెల్విన్‌జోన్స్ స్ఫూర్తితో పేదలకు సాయం

జనగామ టౌన్, జనవరి 13 : లయన్స్ అంతర్జాతీయ సేవా సంస్థ వ్యవస్థాపకుడు మెల్విన్ జోన్స్ గొప్ప మానవతావాదేగాక సేవా తత్పరుడని లయన్స్‌క్లబ్ ఉప జిల్లా గవర్నర్ కన్నా పరశురాములు అన్నారు. మెల్విన్ జోన్స్ జయంతి సందర్బంగా బుధవారం పట్టణంలోని లయన్స్‌క్లబ్‌ల ఆద్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. అనంతరం వైఎస్ఎస్ఆర్ భవన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో విలేకరులకు హెల్మెట్లు పంపిణీ చేశారు. ఆర్టీసీ చౌరస్తాలో అన్నదానం చేశారు.ఈ కార్యక్రమంలో రీజియన్ చైర్మన్ వై సంజీవరెడ్డి, జోన్ చైర్మన్ కృష్ణజీవన్ బజాజ్, గ్లోబల్ సర్వీస్ టీమ్ జిల్లా కో-ఆర్డినేటర్ కుందూరు వెంకట్ రెడ్డి, లయన్స్‌క్లబ్‌ల బాధ్యులు దారం నాగయ్య, బుద్దా రమేశ్, గట్టు వెంకటేశ్వర్లు, భైరు వెంకన్న, బాలాజీ, సీహెచ్ రవీందర్ రెడ్డి, ఏనుగు నర్సిరెడ్డి, శ్రీరాం శ్రీనివాస్, రవికుమార్, రవినాయక్, వెంకట్‌రెడ్డి, మోర్తాల ప్రబాకర్, .ఈడిగం వీరేశం, గట్టు శ్రీనివాస్ తదితరులు పాలొన్నారు.
స్టేషన్‌ఘన్‌పూర్‌లో..
స్టేషన్‌ఘన్‌పూర్ : మండల కేంద్రంలోని బాలుర హైస్కూల్లో బుధవారం లయన్స్‌క్లబ్ శివునిపల్లి, లయన్స్ క్లబ్ ఆఫ్ ధీర ఆధ్వర్యంలో మెల్విన్ జోన్స్ 142వ జయంతిని అడికె సతీశ్‌కుమార్ నేతృత్వంలో నిర్వహించారు. లయన్ కందుకూరి వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ మెల్విన్ జోన్స్ స్థాపించిన లయన్స్ క్లబ్ ద్వారా ప్రపంచంలోని కోట్లాది మంది అనాథలు, నిరుపేదలు, వృద్ధులకు సేవలందిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ జోన్ చైర్మన్ పార్శి కమల్ కుమార్, చార్టర్ అధ్యక్షుడు మంగు జయప్రకాశ్, లయన్స్ క్లబ్ ధీర చార్టర్ అధ్యక్షురాలు నెల్లుట్ల రమాదేవి, కోశాధికారి తుమ్మనిపల్లి కిరణ్ కుమార్, చార్టర్ ట్రెజరర్ పిట్టల మహేందర్, బత్తిని సురేందర్, ఎర్ర యాకూబ్‌రెడ్డి తధితరులు పాల్గొన్నారు.
తాజావార్తలు
- బ్లడ్‌లో హై ఒమెగా-3 ఫ్యాట్‌తో నో కొవిడ్ రిస్క్
- తండ్రికి స్టార్ హీరో విజయ్ లీగల్ నోటీసులు..!
- 'చెరుకు రసం' వల్ల ఎన్నో లాభాలు..
- ‘ఓటిటి’ కాలం మొదలైనట్టేనా..?
- ఐటీ రిటర్న్ ఇంకా పొందలేదా..? ఇలా చేయండి..
- బాలిక బలవన్మరణం
- ఉగాది నాటికి గ్రేటర్ వరంగల్వాసుల ఇంటింటికి మంచినీరు
- గంగూలీ చెకప్ కోసమే వచ్చారు: అపోలో
- 13 సార్లు జైలుకు వెళ్లొచ్చినా తీరు మారలేదు
- ‘ఎన్నికల విధులకు భంగం కలిగిస్తే కోర్టుకు వెళ్తాం’