సమస్యల పరిష్కారం కోసం ‘గోపా ’ ఉద్యమించాలి

గౌడ అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ మండల కన్వీనర్లను జిల్లా లోని పలు మండలాల్లో బుధవారం నిర్వహించిన సమావేశాల్లో ఎన్నుకున్నారు. సమస్యల పరిష్కారం కోసం ఐక్యం గా పోరాడాలని ఈ సందర్భంగా నాయకులు పిలుపునిచ్చారు.
నర్మెట, జనవరి 13 : గౌడ అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్(గోపా) అసోసియేషన్ మండల కన్వీనర్‌గా మండల కేంద్రానికి చెందిన గోపగోని యాదగిరిగౌడ్‌ను ఎన్నుకున్నారు. మండల కేంద్రంలో గోపా జిల్లా కార్యదర్శి కొయ్యాడ శ్రీరాములుగౌడ్ అధ్యక్షతన బుధవారం నిర్వహించిన సమావేశంలో నూతన కమిటీని ఎన్నుకున్నారు. మండల కో-కన్వీనర్లుగా బైరగోని చంద్రమౌళిగౌడ్, గోపగోని స్వామిగౌడ్, ప్రభాకర్‌గౌడ్, బైరగోని శ్రీనివాస్‌గౌడ్, గోపగోని విజయ్‌కుమార్‌గౌడ్, నరేష్గౌడ్ను ఎన్నుకున్నారు. సమావేశంలో జిల్లా అధ్యక్షుడు మేకపోతుల అంజనేయులు, ప్రధాన కార్యదర్శి గూడ రాజు, కార్యదర్శి సుగుణాకర్ తదితరులు పాల్గొన్నారు.
బచ్చన్నపేటలో..
బచ్చన్నపేట : గోపా బచ్చన్నపేట మండల కన్వీనర్‌గా గూడెపు తిరుపతిగౌడ్ను నియమించినట్లు ఆ సంఘం జిల్లా గౌరవాధ్యక్షుడు తీగల సిద్ధిమల్లయ్య, ప్రధాన కార్యదర్శి రావుల వెంకటేశ్ తెలిపారు. బుధవారం జిల్లా బాధ్యులు నల్లగోని బాలకిషన్‌గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో సాల్వాపూర్ గ్రామానికి చెందిన తిరుపతిగౌడ్ను మండల కన్వీనర్‌గా నియమించారు. కో కన్వీనర్‌గా బొమ్మెన నాగేశ్వర్‌గౌడ్, సభ్యులుగా బైరగోని కనుకయ్యగౌడ్, అందె సుధాకర్‌గౌడ్, బత్తిని భాస్కర్‌గౌడ్‌ను నియమించినట్లు వారు వెల్లడించారు. ఈ కార్యక్రమలో రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు అంబటి రాజయ్య, బాల్నె విద్యాసాగర్, పాపాయ్య, బొమ్మెన రాజయ్య, రాజుగౌడ్ పాల్గొన్నారు.
దేవరుప్పులలో..
దేవరుప్పుల : గోపా మండల శాఖ అధ్యక్షుడిగా కామారెడ్డిగూడెం గ్రామానికి చెందిన ఓడపల్లి రవీందర్‌ను ఎన్నుకున్నట్లు ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు మేకపోతుల ఆంజనేయులు తెలిపారు. మండల కేంద్రంలో బుధవారం గోపా మండల స్ధాయి సమావేశం పాలకుర్తి నియోజకవర్గ ఆర్గనైజింగ్ సెక్రటరీ దేశగాని నాగరాజు అధ్యక్షతన జరిగింది. నూతన కార్యవర్గంలో కో-కన్వీనర్లుగా దేవరుప్పులకు చెందిన ఊడుగు సందీప్‌గౌడ్, గొల్లపల్లికి చెందిన తీగల సత్యనారాయణ, సీతారాంపురానికి చెందిన బస్వ వెంకన్న, నీర్మాలకు చెందిన మేకపోతుల వేంకటేశ్వర్లు, రామరాజుపల్లికి చెందన బత్తిని భరత్గౌడ్ను ఎన్నుకున్నట్టు నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి గూడ రాజబోస్, ఉపాధ్యక్షుడు కోతి ప్రవీణ్, కార్యదర్శి దుబ్బ రాజశేఖర్ గౌడ్ పాల్గొన్నారు.
పాలకుర్తిలో..
పాలకుర్తి : గోపా మండల కన్వీనర్‌గా పాలకుర్తికి చెందిన కమ్మగాని రమేశ్‌గౌడ్ ఎన్నికయ్యారు. కో-కన్వీనర్లుగా తాళ్లపల్లి చంద్రశేఖర్‌గౌడ్, కమ్మగాని శ్రీనివాస్‌గౌడ్, బీసు స్వామిగౌడ్, మెరుగు మధుసూదన్‌గౌడ్, బండి సోమన్న, మూల మహేందర్‌గౌడ్, ఎన్నికయ్యారు.
తాజావార్తలు
- గంగా జలానికి తరలివెళ్లిన మెస్రం గిరిజనులు
- బాలకృష్ణ కోసం 'క్రాక్' డైరెక్టర్ పవర్ఫుల్ స్టోరీ..!
- సీరం ఇన్స్టిట్యూట్ అగ్నిప్రమాదంలో.. ఐదుగురు మృతి
- వర్క్ ఫ్రం హోం.. సైకిళ్లపై ముంబై టు కన్యాకుమారి
- నగర పోలీసుల వార్షిక ఫైరింగ్ ప్రాక్టీస్
- కోవిడ్ వ్యాక్సిన్ : ఆధార్ కీలకం
- నూరుశాతం గొర్రెల యూనిట్ల పంపిణీ
- రూ.190లకే లాపీ: అడ్డంగా బుక్కయిన అమెజాన్
- 'ఈ ఘనత సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌లదే'
- కోవిషీల్డ్ ఉత్పత్తికి ఎలాంటి నష్టం లేదు: సీరం సీఈవో