గురువారం 21 జనవరి 2021
Jangaon - Jan 14, 2021 , 01:41:37

నూతన వ్యవసాయ చట్టాలను రద్దుచేయాలి

నూతన వ్యవసాయ చట్టాలను రద్దుచేయాలి

రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాగర్‌

బచ్చన్నపేట, జనవరి 13 : కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగానికి విరుద్ధంగా నూతన వ్యవసాయ చట్టాలు తీసుకొచ్చి ప్రజలను ఇబ్బందులను గురి చేస్తున్నదని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తీగల సాగర్‌ అన్నారు. కేంద్ర ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ చేపట్టిన రైతుజాత బుధవారం మండల కేంద్రానికి చేరింది. ఈ సందర్భంగా ప్రధాన చౌరస్తాలో కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలపై కళాకారులు ప్రదర్శనలు ఇచ్చారు. సాగర్‌ మాట్లాడుతూ తరతరాలుగా వ్యవసాయంపై ఆధారపడి కుటుంబాలను వెల్లదీస్తున్న రైతులకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలతో పంటలు సాగు చేయడం భారంగా మారనుందన్నారు. కార్పొరేట్‌ సంస్థలకు అనుకూలంగా వ్యవహరిస్తున్న కేంద్రం ఇప్పటికైనా రైతు సమస్యలను పరిశీలించి నూతన చట్టాలను రద్దు చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం రాష్ట్ర , జిల్లా నాయకులు శోభన్‌నాయక్‌, మోకు కనకారెడ్డి, బూడిద గోపి, మీట్యానాయక్‌, కాంగ్రెస్‌, సీపీఎం నాయకులు శ్రీనివాస్‌, బాపురెడ్డి, నల్లగోని బాలకిషన్‌గౌడ్‌, అల్వాల ఎల్లయ్య, మహాత్మాచారి తదితరులు పాల్గొన్నారు.logo