శుక్రవారం 22 జనవరి 2021
Jangaon - Jan 13, 2021 , 00:42:15

నాటిన మొక్కలను బాధ్యతగా సంరక్షించాలి

నాటిన మొక్కలను బాధ్యతగా సంరక్షించాలి

  • జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి

నర్మెట, జనవరి 12 : జనగామ నుంచి నర్మెట, తరిగొప్పుల మండలాల వరకు 36 కిలోమీటర్ల పరిధిలో మొక్క లు నాటుతున్న వారికి ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అభినందనలు తెలిపారు. మంగళవారం ఆయా మండలా ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో రహదారికి ఇరువైపులా నాటుతున్న మొక్కలను ఆయన పరిశీలించారు. ముత్తిరెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ ఆలోచనలకు అనుగుణంగా స్థానిక సర్పంచ్‌లు, ఎంపీటీసీలు మందుకు రావడం హర్షణీయమన్నారు. తెలంగాణకు హరితహారం మణిహారంలా ఉందని భారత ప్రధాని నరేంద్రమోదీ కొనియాడారని ముత్తిరెడ్డి అన్నారు. తరిగొప్పుల మండలం చివరి వరకూ మొక్కలు నాటి సంరక్షించాలని ఎంపీడీవో ఇంద్రసేనారెడ్డికి ఆయన సూచించారు. అంతకుముందు నర్మెటకు చెందిన శివరాత్రి రవి తనకు వికలాంగుల ఎలక్ట్రానిక్‌ సైకిల్‌ కావాలని కోరడంతో వెంటనే సంబంధిత అధికారులతో మాట్లాడి సైకిల్‌ ఇప్పిస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నర్మెట ఎంపీపీ తేజావత్‌ గోవర్ధన్‌, సర్పంచ్‌ల ఫో రం మండల అధ్యక్షుడు ఆమెడపు కమలాకర్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ జిల్లా నాయకుడు పెద్ది రాజిరెడ్డి, సర్పంచ్‌లు దామెర ప్రభుదాస్‌, లకావత్‌ కిరణ్‌నాయక్‌, పగడాల విజయ నర్స య్య, భూక్యా రవి, తరిగొప్పుల మండల అధ్యక్షుడు పింగిళి జగన్మోహన్‌రెడ్డి, ఎంపీటీసీ అర్జుల మధుసూదన్‌రెడ్డి, రైతుబంధు సమితి అధ్యక్షుడు భూక్య జూంలాల్‌నాయక్‌, టీఆర్‌ఎస్వీ జిల్లా అధ్యక్షుడు వంగ ప్రణీత్‌రెడ్డి, నక్కల రవి, గుడికందుల నరహరి, ముద్దసాని వెంకట్‌రెడ్డి, జొన్నగోని కిష్టయ్య, తాళ్లపల్లి పోశయ్య, ఇరుమల్ల రాజయ్య, తాళ్లపల్లి రాజేశ్వర్‌, వంగ రామరాజు పాల్గొన్నారు.

వివేకానందుడిని ఆదర్శంగా తీసుకోవాలి

 వివేకానందుడి జీవితాన్ని యువకులు ఆదర్శంగా తీసకోవాలని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అన్నారు. నర్మెట  హన్మంతాపూర్‌లో నిర్వహించిన వివేకానందుడి జయంతి ఉత్సవాల్లో ఆయన పాల్గొన్నారు. అనంతరం వెల్దండ గ్రామంలో స్వామి వివేకానంద పరపతి సంఘం ఆధ్వర్యంలో పదో తరగతి విద్యార్థులకు పరీక్ష ప్యాడ్‌లను అందించారు. కార్యక్రమంలో ఎంపీపీ తేజావత్‌ గోవర్ధన్‌, సర్పంచ్‌ పగడాల విజయ, యూత్‌ సభ్యులు దూసరి పవన్‌, సభ్యులు, వెల్దండలో వైస్‌ ఎంపీపీ మంకెన ఆగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.


logo