ఆదివారం 28 ఫిబ్రవరి 2021
Jangaon - Jan 13, 2021 , 00:42:14

జాగృతి ఆధ్వర్యంలో సంక్రాంతి ముగ్గుల పోటీలు

జాగృతి ఆధ్వర్యంలో  సంక్రాంతి ముగ్గుల పోటీలు

జనగామ చౌరస్తా, జనవరి 12 : సంక్రాంతి పండుగను పురస్కరించుకుని తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో మంగళవారం జిల్లా కేంద్రంలోని ధర్మకంచ జడ్పీ హైస్కూల్‌ ఆవరణలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జాగృతి జిల్లా మహిళా అధ్యక్షురాలు నల్ల సజిత, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పోకల జమున, వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌ బాల్దె విజయ పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ కరోనా అనంతరం మహిళలంతా ఒకచోట చేరి రంగుల హరివిల్లులు వేయడం సంక్రాంతి శోభను తీసుకొచ్చిందన్నారు. ముగ్గుల పోటీల్లో ప్రథమ బహుమతిని మాదారపు మయూరి(ధర్మకంచ), ద్వితీయ బహుమతిని మేడ సంధ్య (ధర్మకంచ), తృతీయ బహుమతిని యామిని(గణేశ్‌వాడ) కైవసం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ జాగృతి కొడకండ్ల మండల అధ్యక్షురాలు వలికి శోభ, జనగామ పట్టణ మహిళా కన్వీనర్‌ దూపటి రాజేశ్వరి, కౌన్సిలర్‌ మల్లిగారి చంద్రకళ, మున్సిపల్‌ కో ఆప్షన్‌ సభ్యురాలు పానుగంటి రహేల  పాల్గొన్నారు.

మన సంస్కృతి గొప్పది : పాగాల

స్టేషన్‌ఘన్‌పూర్‌ : భారతదేశంలోనే తెలంగాణ సంస్కృతి ఎంతో  గొప్పదని జడ్పీ చైర్మన్‌ పాగాల సంపత్‌ రెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలుర కళాశాలలో స్వేరోస్‌ సంస్థ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి ముగ్గుల పోటీలు నిర్వహించారు. స్వేరో సంస్థ జిల్లా అధ్యక్షురాలు గాదె రజిత ఆధ్వర్యంలో నిర్వహించిన ముగ్గుల పోటీల్లో ‘ఆడపిల్లలను కాపాడండి, మహిళలను గౌరవించండి’ అని తెలుపుతూ శ్రీజ  వేసిన ముగ్గు ఆకట్టుకుంది. అనంతరం విజేతలకు పాగాల సంపత్‌రెడ్డి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్‌ శ్రీనివాస్‌రావు, వైస్‌ ప్రిన్సిపాల్‌ సమ్మయ్య, పీడీ శ్రీనివాస్‌, స్వేరో సంస్థ జోనల్‌ అధికార ప్రతినిధి కరుణాకర్‌, చాడా వెంకటస్వామి, మహిపాల్‌, వినోద్‌, పరమేశ్వర్‌, హేమలత తదితరులు పాల్గొన్నారు. 

VIDEOS

logo