శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
Jangaon - Jan 12, 2021 , 02:53:22

వివేకానందుడిని యువత ఆదర్శంగా తీసుకోవాలి

వివేకానందుడిని యువత ఆదర్శంగా తీసుకోవాలి

జనగామ టౌన్‌, జనవరి 11 : భారతదేశ ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన స్వామివివేకానందుడిని ఆదర్శంగా తీసుకుని యువత అన్నిరంగాల్లో రాణించాలని జిల్లా యువజన, క్రీడల శాఖ అధికారి గోపాల్‌రావు అన్నారు. వివేకానందుడి జయంతిని పురస్కరించుకుని క్రీడల శాఖ ఆధ్వర్యంలో జనగామ పట్టణంలోని ధర్మకంచ మినీ స్టేడియంలో సోమవారం ఆటల పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా గోపాల్‌రావు మాట్లాడుతూ వివేకానందుడి ఆలోచనలను, ఆదర్శాలను యువత స్ఫూర్తిగా తీసుకో వాలని ఆయన పిలుపుని చ్చారు. అనంతరం అండర్‌ 16, అండర్‌ 18, అండర్‌ 20 క్రీడాకారులకు 100 మీ టర్లు, 800 మీటర్ల పరుగు పందెంతోపాటు లాంగ్‌జంప్‌, షాట్‌పుట్‌, వాలీబాల్‌, బాక్సింగ్‌ పోటీలు నిర్వహించారు. విజేతలకు జిల్లా కలెక్టర్‌ నిఖిల మంగళవారం బహుమతులు ప్రదానం చేస్తారని నిర్వాహకులు తెలిపారు.


VIDEOS

logo