మంగళవారం 02 మార్చి 2021
Jangaon - Jan 12, 2021 , 02:53:20

దేవాలయాల అభివృద్ధికి తెలంగాణ సర్కారు కృషి : రాజయ్య

దేవాలయాల అభివృద్ధికి తెలంగాణ సర్కారు కృషి  : రాజయ్య

రఘునాథపల్లి, జనవరి 11 : గ్రామాల్లోని దేవాలయాల అభివృద్ధికి సీఎం కేసీఆర్‌ నిధు లు కేటాయిస్తున్నారని స్టేషన్‌ఘన్‌ఫూర్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ తాటికొండ రాజయ్య అన్నారు. మం డల కేంద్రంలోని మహాదేవస్వామి ఆలయ ప్రతిష్ఠాపనోత్సవంలో భాగంగా సోమవారం నిర్వహించిన పూజల్లో ఆయన పాల్గొన్నారు. రాజయ్య మాట్లాడుతూ సీమాంధ్ర పాలనలో తెలంగాణలోని ఆలయాలకు నిధులు కేటాయించలేదన్నారు. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్‌ మంజూరు చేసిన రూ.21 లక్షలతో శివాలయం, ఆంజనేయస్వామి ఆలయ నిర్మాణ పనులు చేపట్టినట్లు ఆయన వివరించా రు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ బొల్లం అజయ్‌కుమార్‌, ఎంపీపీ మేకల వరలక్ష్మి, సర్పంచ్‌ల ఫోరం జిల్లా అధ్యక్షుడు పోకల శివకుమార్‌, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు ఎర్రోళ్ల కుమార్‌గౌడ్‌, మహిళావిభాగం మండల అధ్యక్షురాలు మడ్లపల్లి సునీత, నాయకులు జిట్టె వీరస్వామి, వారాల రమేశ్‌, నామాల బుచ్చయ్య, కొర్ర రాజేందర్‌, ఎంపీటీసీ పేర్నె ఉషారవి, ఆలయ కమిటీ చైర్మన్‌ కూరెళ్లి ఉపేందర్‌, వేదకుమార్‌, కోళ్ల రవిగౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.   


VIDEOS

logo