మంగళవారం 09 మార్చి 2021
Jangaon - Jan 11, 2021 , 01:54:31

12న తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో సంక్రాంతి ముగ్గుల పోటీలు

12న తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో సంక్రాంతి ముగ్గుల పోటీలు

జనగామ చౌరస్తా, జనవరి 10 : ఈ నెల 12న జిల్లా కేంద్రంలోని ధర్మకంచ జడ్పీ హైస్కూల్‌ ఆవరణలో సంక్రాంతి ముగ్గుల పోటీలను నిర్వహిస్తున్నట్లు తెలంగాణ జాగృతి జిల్లా అధ్యక్షుడు పసునూరి మురళి తెలిపా రు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆదేశాలకనుగుణంగా జిల్లాలో ముగ్గుల పోటీలను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ పోటీలను మహిళలు విజయవంతం చే యాలని మురళి కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ జా గృతి మహిళా విభాగం జిల్లా కన్వీనర్‌ నల్లా సజిత, పాలకుర్తి, స్టేషన్‌ ఘన్‌పూర్‌, జనగామ నియోజకవర్గాల కన్వీనర్లు, మండలాల కన్వీనర్లు పాల్గొన్నారు.


VIDEOS

logo