గురువారం 25 ఫిబ్రవరి 2021
Jangaon - Jan 10, 2021 , 02:12:20

అన్నివర్గాల సంక్షేమమే సీఎం కేసీఆర్‌ ధ్యేయం

అన్నివర్గాల సంక్షేమమే సీఎం కేసీఆర్‌ ధ్యేయం

లింగాలఘనపురం, జనవరి 9 : అన్నివర్గాల సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్‌ పాలన అందిస్తున్నారని కురుమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు సేవెల్లి సంపత్‌, జనగామ మార్కెట్‌ చైర్‌పర్సన్‌ బాల్నె విజయ సిద్ధులు అన్నారు. శనివారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో నూతన సంవత్సర క్యాలెండర్లను వారు విడుదల చేశారు. కేమిడి వీరసాయిమల్లేశ్‌ అధ్యక్షతన జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌ సర్కారు మాత్రమే కురుమలకు గుర్తింపునిచ్చిందన్నారు. కురుమలకు సీఎం కేసీఆర్‌ రాజకీయంగా ప్రాధాన్యమిస్తూనే ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు గొర్రెల పెంపకం పథకాన్ని అమలు చేస్తున్నారన్నారు. సమావేశంలో సొసైటీ చైర్మన్‌ మల్గ శ్రీశైలం, మాజీ వైస్‌ ఎంపీపీ గవ్వల మల్లేశం, ఎంపీటీసీ కేమిడి భిక్షపతి, ఉపసర్పంచ్‌ కేమిడి కవితావెంకటేశ్‌, నాయకులు చౌదరపెల్లి విజయభ్కార్‌, శేఖర్‌, బర్ల మాధవికుమార్‌, బండ భిక్షపతి, వీరమల్లయ్య, కర్రె కృష్ణ తదితరులు పాల్గొన్నారు. 


VIDEOS

logo