శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
Jangaon - Jan 10, 2021 , 02:12:22

మృతుల కుటుంబాలకు సుధాకర్‌రావు, ఉషాదయాకర్‌రావు పరామర్శ

మృతుల కుటుంబాలకు సుధాకర్‌రావు, ఉషాదయాకర్‌రావు పరామర్శ

పాలకుర్తి రూరల్‌ జనవరి 9ః మండల కేంద్రంతోపాటు విస్నూరులో ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన వారి కుటుంబాలను మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ ఎన్‌ సుధాకర్‌రావు, ఎర్రబెల్లి చారిటబుల్‌ ట్రస్టు చైర్‌పర్సన్‌ ఎర్రబెల్లి ఉషా దయాకర్‌రావు శనివారం వేర్వేరుగా పరామర్శించారు. మండల కేంద్రంలోని ప్రగతి విద్యానిలయం కరస్పాండెంట్‌ వీరమనేని వెంకటేశ్వర్‌రావు తల్లి తారమ్మ అనారోగ్యంతో మృతి చెందగా ఉషా దయాకర్‌రావు పరామర్శించారు. విస్నూరులో కొడకండ్ల వ్యవసాయ మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ ఎర్రబెల్లి రాఘవరావు తల్లి సుశీలమ్మ మృతి చెందడంతో మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ ఎన్‌ సుధాకర్‌రావు ఆమె కుమారులు ఎర్రబెల్లి ప్రసాదర్‌రావు, అశోక్‌రావును పరామర్శించారు. వారి వెంట జడ్పీ ఫ్లోర్‌ లీడర్‌ పుస్కూరి శ్రీనివాస్‌రావు, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు పసునూరి నవీన్‌, జడ్పీ కో ఆప్షన్‌ సభ్యుడు ఎండీ మదార్‌, ఎండీ అఫ్రోజ్‌, సర్పంచ్‌లు నకీర్త యాకయ్య, వీరమనేని యాకాంతారావు, ఎంపీటీసీ మాటూరి యాకయ్య, కడుదుల కరుణాకర్‌రెడ్డి ఉన్నారు.


VIDEOS

logo