గురువారం 25 ఫిబ్రవరి 2021
Jangaon - Jan 10, 2021 , 02:12:22

పల్లెప్రగతి పనులకు నిధులు మంజూరు : ఎంపీడీవో

పల్లెప్రగతి పనులకు నిధులు మంజూరు : ఎంపీడీవో

దేవరుప్పుల, జనవరి 9 : పల్లెప్రగతిలో భాగంగా గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధి పనులకు ఉపాధిహామీ నిధులు మంజూరయ్యాయని ఎంపీడీవో ఉమామహేశ్వర్‌ తెలిపారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఆయా గ్రామాల్లో సెగ్రిగేషన్‌ షెడ్లు, నర్సరీలు, శ్మశాన వాటికలకు సంబంధించి పెండింగ్‌ బిల్లులకు ఉపాధిహామీ నిధుల నుంచి రూ. 81 లక్షలు మంజూరయ్యాయని ఆయన తెలిపారు. ప్రత్యేక శ్రద్ధతో గ్రామాల్లో సర్పంచ్‌లు పనులు చేశారని, కొంత ఆలస్యమైనా నిధులు విడుదల చేశామన్నారు. గత ఆగస్టు వరకు జరిగిన పనులకు వంద శాతం బిల్లులు చెల్లించామన్నారు. సెగ్రిగేషన్‌ షెడ్లకు రూ.55 లక్షలు, శ్మశాన వాటికలకు రూ.5 లక్షలు, నర్సరీల్లో గేటు, కంపౌండ్‌ వాల్‌ నిర్మాణానికి రూ. 20 లక్షలు చెల్లించామన్నారు.

జీడికల్‌లో సామాజిక తనిఖీ 

లింగాలఘనపురం : మండలంలోని జీడికల్‌లో శనివారం ఉపాధిహామీ పనులపై సామాజిక తనిఖీ గ్రామసభను అధికారులు నిర్వహించారు. సర్పంచ్‌ రాజు అధ్యక్షతన జరిగిన సమావేశంలో స్థానికంగా జరిగిన అభివృద్ధి పనులకు వెచ్చించిన డబ్బుల వివరాలను ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రత్యేకాధికారి అనిత, ఏపీవో రాజకర్ణ, పంచాయతీ కార్యదర్శి సతీశ్‌ తదితరులు పాల్గొన్నారు.


VIDEOS

logo