బుధవారం 24 ఫిబ్రవరి 2021
Jangaon - Jan 09, 2021 , 01:57:07

‘వేదిక ’ ఆధ్వర్యంలో విద్యుత్‌ సమస్యల పరిష్కారం

‘వేదిక ’ ఆధ్వర్యంలో విద్యుత్‌ సమస్యల పరిష్కారం

స్టేషన్‌ఘన్‌పూర్‌టౌన్‌, జనవరి 8: మండల కేంద్రంలోని 132/33 కేవీ విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ ఆవరణలో శుక్రవారం విద్యుత్‌ వినియోగదారుల సమస్యల పరిష్కార వేదిక ఎన్‌పీడీసీఎల్‌ డీఈ సదానందం అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన విద్యుత్‌ వినియోగదారుల సమస్యల పరిష్కార వేదిక చైర్మన్‌ సత్యనారాయణ మాట్లాడుతూ ఇప్పటి వరకు స్టేషన్‌ఘన్‌పూర్‌ డివిజన్‌ పరిధిలో దాదాపు 20 దరఖాస్తులు వచ్చాయని, ఇందులో సమస్యలను తెలుసుకుని పరిష్కరించినట్లు తెలిపారు. ఫోరం వద్దకు రాలేని వినియోగదారులు 9440811299 లేదా 9491307004 లేదా 8333923840 నంబర్లకు సమస్యను వివరిస్తూ వాట్సాప్‌ చేయాలని, వాట్సాప్‌ లేని వారు ల్యాండ్‌లైన్‌ ఫోన్‌ నెంబర్‌ 0870-2461551లో సంప్రదించాలని ఆయన కోరారు. ప్రజలకు మరింత చేరువ అయ్యేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో ఎన్‌పీడీసీఎల్‌ ఎస్‌ఈ మల్లికార్జున్‌, ఫైనాన్స్‌ సభ్యుడు ఆర్‌.చరన్‌దాస్‌, టెక్నికల్‌ సభ్యుడు తిరుమల్‌రావు, ఇండిపెండెంట్‌ సభ్యుడు గణపతిరెడ్డి, ఎస్‌ఏవో నర్సింగరావు, డివిజన్‌ డీఈ సదానందం, ఏడీఈ పాపిరెడ్డి, ఏఈ రమేశ్‌ పాల్గొన్నారు.    


VIDEOS

logo