మరో బాసరగా బమ్మెర

- పర్యాటక పనుల్లో వేగం పెంచాలి
- ఏడాదిలోపు పూర్తి చేసి, కేసీఆర్ చేతులమీదుగా ప్రారంభిస్తాం
- డబుల్ బెడ్రూం ఇండ్లకు పైసలు వసూలు చేస్తే కేసులు తప్పవు
- మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు
పాలకుర్తి రూరల్, జనవరి 8 : బమ్మెర, పాలకుర్తి, వల్మిడిలో జరుగుతున్న పర్యాటక పనుల్లో వేగం పెం చి, ఏడాది లోపు పూర్తి చేయాలని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, నీటి సరఫరాల శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. శుక్రవారం బమ్మె ర, పాలకుర్తి, వల్మిడి పర్యాటక ప్రాంతాల్లో పనుల పురోగతిపై విశ్రాంత ఐఏఎస్ అధికారి బీవీ పాపారావు, కలెక్టర్ నిఖిలతో కలిసి అధికారులు, ప్రజా ప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం పోతన సమాధి వద్ద పూజలు చేశారు. ఈ సందర్భం గా మంత్రి మాట్లాడుతూ.. బమ్మెరను మరో బాసరగా తీర్చిదిద్దుతానన్నారు. సీఎం కేసీఆర్‌కు నచ్చిన ప్రాంతం, మెచ్చిన కవి బమ్మెర పోతన అని అన్నారు. ఏడాదిలోపు పనులు పూర్తి చేసి, సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభిస్తామన్నారు. కాగా, పనుల పురోగతిపై మంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. సక్రమంగా పనులు చేయకుంటే నోటీసులు ఇచ్చి కాంట్రాక్టు రద్దు చేయాలని అధికారులను ఆదేశించారు. వల్మిడి ఆల య అభివృద్ధిలో భాగంగా గుట్టపైకి రోడ్డు కోసం రూ.కోటి, పాలకుర్తికి రూ.10కోట్లు, వల్మిడికి రూ.5కో ట్లు, బమ్మెరకు రూ.7.50కోట్లు మంజూరు చేశామన్నారు. వచ్చే నెలలో బమ్మెర, వల్మిడి, పాలకుర్తి ప్రాంతాల్లో పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌తో కలిసి పనుల పురోగతిపై సమీక్షిస్తామన్నారు. డబుల్ బెడ్రూం ఇండ్ల కోసం పేదల నుంచి ఎవరైనా డబ్బు లు వసూలు చేస్తే కేసులు తప్పవని హెచ్చరించారు. పాలకుర్తి నియోజకవర్గాన్ని అభివృద్ధిలో రాష్ట్రంలో ప్రథమస్థానంలో నిలుపుతానన్నారు. ఈ కార్యక్రమంలో ఇంటాక్ సంస్థ చైర్మన్ ప్రొఫెసర్ పాండు రంగారావు, టూరిజం శాఖ ఎండీ గోపాల్‌రావు, ఆర్అండ్బీ డీఈ జీవన్‌కుమార్, అదనపు కలెక్టర్ భాస్కర్‌రావు, తహసీల్దార్ విజయభాస్కర్, ఎంపీపీ నల్లా నాగిరెడ్డి, జడ్పీ కో ఆప్షన్ సభ్యుడు మధార్, ఎఫ్ఎస్సీఎస్ బ్యాంకు చైర్మన్ బొబ్బల అశోక్‌రెడ్డి, వైస్ ఎంపీపీ శారద, సర్పంచ్‌లు సైదులు, మల్లారెడ్డి, ఎంపీటీసీ ఛత్రూనాయక్ పాల్గొన్నారు.
తాజావార్తలు
- ఆ డీల్ కుదరకపోతే 11 లక్షల ఉద్యోగాలు పోయినట్లే!
- డిజిటల్ వార్: గూగుల్+ఫేస్‌బుక్‌తో రిలయన్స్ జట్టు
- కంట్రోల్డ్ బ్లాస్టింగ్ మెథడ్‌తో భవనం కూల్చివేత
- ఏపీలో కొత్తగా 118 కరోనా కేసులు
- బార్బర్‌గా మారిన ప్రిన్సిపాల్.. విద్యార్థి హెయిర్‌కట్ సరిచేసిన వైనం
- మొదటి ప్రాధాన్యత ఓటు పల్లా రాజేశ్వర్‌రెడ్డికే
- సామాన్యుడి చెంతకు న్యాయవ్యవస్థను తేవాలి : వెంకయ్యనాయుడు
- కాయిర్ బోర్డ్ సభ్యుడిగా టిఫ్ జాయింట్ సెక్రటరీ గోపాల్‌రావు
- వ్యభిచార ముఠా గుట్టురట్టు.. ఏడుగురు నిందితులు అరెస్ట్
- 87 లక్షలు పెట్టి ఇల్లు కొని.. భారీ సొరంగం తవ్వి.. వెండి చోరీ