అభివృద్ధిని చూసి ఓటెయ్యండి

- రానున్న రోజుల్లో భారీగా ఉద్యోగ నియామకాలు
- పీఆర్సీ విషయంలో ఉద్యోగులకు త్వరలోనే తీపికబురు
- ప్రభుత్వ చీఫ్‌విప్ దాస్యం, ఎమ్మెల్సీలు కడియం, పల్లా రాజేశ్వర్‌రెడ్డి
- హన్మకొండలో ఉద్యోగ సంఘాల నేతలు, వాకర్స్‌తో మాటామంతీ
సుబేదారి, జనవరి7 : అరవై ఏళ్ల దరిద్రాన్ని పారదోలి ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణను అభివృద్ధి, సంక్షేమంలో దేశంలోనే అగ్రగామిగా నిలిపిన తీరును చూసి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థికి ఓటు వేయాలని రాష్ట్ర ప్రభుత్వ చీఫ్‌విప్ దాస్యం వినయ్‌భాస్కర్, మాజీ డిప్యూటీ సీఎం, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి విజ్ఞప్తి చేశారు. వరంగల్, నల్లగొండ, ఖమ్మం జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డితో కలిసి, వారు గురువారం హన్మకొండ సుబేదారి ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానంలో మార్నింగ్ వాకింగ్‌చేస్తూ ఉద్యోగ సం ఘాల నాయకులు, సీనియర్ సిటిజన్స్, యువకులతో మాట్లాడారు. ఆరున్నరేళ్లలో తెలంగాణ సాధించిన ప్రగతిపై వివరించారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ అమలుకాని పథకాలు ఒక్క తెలంగాణలోనే అమలవుతున్నాయని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఆరేళ్లలో టీఎస్పీఎస్సీ, పోలీసు, విద్యుత్ శాఖల్లో మొత్తం లక్షా 30వేల ఉద్యోగ నియామకాలు చేపట్టిందని గుర్తు చేశారు. ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని విమర్శించారు. సీఎం కేసీఆర్ వివిధ శాఖల వారీగా ఖాళీల లెక్కలు తీస్తున్నారని, త్వరలోనే పెద్ద ఎత్తున ఉద్యోగ నియామకాలు చేపడుతారని చెప్పారు. పీఆర్సీ విషయంలోనూ కొద్దిరోజుల్లోనే ఉద్యోగులకు సీఎం తీపి కబురు చెబుతారన్నారు. ఎమ్మెల్సీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డిని యువత, ఉద్యోగులు, ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరూ ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
ఆదరించండి : పల్లా రాజేశ్వర్‌రెడ్డి
ఖమ్మం, వరంగల్, నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థిని ఆదరించి గెలిపించాలని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి కోరారు. ఉమ్మడి రాష్ట్రంలో నిధులు, నియామకాలు, నీళ్లు కొల్లగొట్టారని, స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ ఈ మూడింటిపై ప్రత్యేక దృష్టి పెట్టి రాష్ర్టా న్ని అభివృద్ధి పథంలో ముందుకు నడిపిస్తున్నారని చెప్పారు. కొద్దిరోజుల్లో ఉద్యోగ నోటిఫికేషన్లు రాబోతున్నాయని, నిరుద్యోగ యువతకు కేసీఆర్ ప్రభుత్వం అండగా నిలుస్తుందన్నారు. మతంపేరుతో ముందుకొస్తున్న కొందరు అవాకులు చ వాకులు పేలుతున్నారని, వారికి తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. వారివెంట ఉద్యోగ సంఘాల నాయకులు జగన్మోహన్రావు, కోల రా జేశ్, అస్నాల శ్రీనివాస్, పుల్లా శ్రీనివాస్, కార్పొరేటర్ మాధవరెడ్డి, నాయకులు ఇండ్ల నాగేశ్వర్రావు, వీరేందర్, చిర్ర రాజు ఉన్నారు.
తాజావార్తలు
- నేషనల్ ఇస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి ‘మహా’ నమూనాలు
- ఇండో-పాక్ సంబంధాల్లో కీలక పరిణామం.. మళ్లీ చర్చలు షురూ!
- రెచ్చిపోయిన పృథ్వీ షా.. మెరుపు డబుల్ సెంచరీ
- కఠిక పేదరికాన్ని నిర్మూలించాం.. ప్రకటించిన చైనా అధ్యక్షుడు
- కళ్లు దుకాణాల్లో సీసీ కెమెరాలు
- షాకింగ్ : పక్కదారి పట్టిందనే ఆగ్రహంతో భార్యను హత్య చేసి..
- క్రికెట్లో ఈయన రికార్డులు ఇప్పటికీ పదిలం..
- పవన్ కళ్యాణ్‌తో జతకట్టిన యాదాద్రి చీఫ్ ఆర్కిటెక్ట్
- వీడియో : గంటలో 172 వంటకాలు
- ఫలక్‌నుమాలో భారీగా లభించిన పేలుడు పదార్థాలు