ఆదివారం 07 మార్చి 2021
Jangaon - Jan 08, 2021 , 01:04:07

బీసీలకు అండగా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం

బీసీలకు అండగా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం

  • రాష్ట్ర ప్రభుత్వ చీఫ్‌ విప్‌ 
  • దాస్యం వినయ్‌భాస్కర్‌ 

కాజీపేట, జనవరి7 : రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి బీసీలకు అన్ని విధాలా అండగా ఉం టున్నదని ప్రభుత్వ చీఫ్‌ విప్‌ దాస్యం వినయ్‌భాస్కర్‌ అన్నారు. ఫాతిమానగర్‌లోని వైష్ణవి గ్రాండ్‌ హోటల్‌లో బీసీ సంక్షేమ సంఘం వరంగల్‌ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు వడ్లకొండ వేణుగోపాల్‌ ఆధ్వర్యంలో గురువారం ఇటీవల ఎమ్మెల్సీగా బాధ్యతలు చేపట్టిన బస్వరాజు సారయ్యను సన్మానించారు. అనంతరం బీసీ సంక్షేమ సంఘం 2021 క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా దాస్యం మాట్లాడుతూ.. త్వరలో జరుగనున్న గ్రేటర్‌ ఎన్నికల్లో బీసీల్లోని అన్ని కులాలకు అవకాశం కల్పిస్తామని చెప్పారు. ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య మాట్లాడుతూ.. బీసీలను కంటికి రెప్పలా కాపాడుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌, రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ బైరి రవికృష్ణ గౌడ్‌, బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్‌, దాడి మల్లయ్య, తాళ్ల సంపత్‌, డాక్టర్‌ జగదీశ్‌ప్రసాద్‌, సురేశ్‌, మల్లయ్య, శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు. 


VIDEOS

logo