గురువారం 04 మార్చి 2021
Jangaon - Jan 06, 2021 , 02:09:36

అంధుల కోసం గ్రంథాలయాల్లో వసతులు కల్పించాలి : కలెక్టర్‌

అంధుల కోసం గ్రంథాలయాల్లో వసతులు కల్పించాలి : కలెక్టర్‌

జనగామ టౌన్‌, జనవరి 5 : అంధుల కోసం గ్రంథాలయాల్లో వసతులు కల్పించాలని కలెక్టర్‌ నిఖిల అధికారులను ఆదేశించారు. పట్టణంలోని జిల్లా గ్రంథాలయాన్ని కలెక్టర్‌ మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లాలోని గ్రంథాలయాల నిర్వహణపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. అం ధుల కోసం ప్రత్యేక గదిని ఏర్పాటు చేసి, కంప్యూటర్‌ సౌకర్యం కల్పించాలని ఆమె సూచించారు. జిల్లాలోని అ న్ని గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీల నుం చి గ్రంథాలయ సంస్థకు రావాల్సిన, వచ్చిన గ్రంథాలయ సెస్సు బకాయిలను నిఖిల తెలుసుకున్నారు. సెస్సు ఆధారంగా మరింత అభివృద్ధి చేయొ చ్చని సూచించారు. ఈ కా ర్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ ఎడవెల్లి కృష్ణారెడ్డి, అదనపు కలెక్టర్‌ అబ్దుల్‌ హమీద్‌, జిల్లా సంక్షేమ అధికారి జయంతి, డిప్యూటీ తహసీల్దార్‌ రమేశ్‌, గ్రంథాలయ సెక్రటరీ శ్రీలత తదితరులు పాల్గొన్నారు.


VIDEOS

logo