నియోజకవర్గంలోని ప్రతి ఎకరాకు సాగునీరు

- స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే రాజయ్య
జఫర్‌గఢ్, జనవరి 5 : నియోజకర్గంలోని ప్రతి ఎకరాకు సాగునీరందించడమే తెలంగాణ సర్కారు ధ్యేయమని, సీఎం కేసీఆర్ లక్ష్యానికనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య అన్నారు. మండలంలోని తిడుగు శివారులోని ఆకేరు వాగుపై రూ.4.80 కోట్లతో నిర్మించే చెక్‌డ్యామ్‌కు మంగళవారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశానికి ఎంపీపీ రడపాక సుదర్శన్ అధ్యక్షత వహించగా రాజయ్య మాట్లాడుతూ నియోజకవర్గంలోని ఆరు రిజర్వాయర్లతో బీడు భూములకు సాగునీరందిస్తామన్నారు. మరో ఐదు చెక్‌డ్యామ్‌లు మంజూరయ్యాయని తెలిపారు. ఈ నెల 8న సీఎం కేసీఆర్‌ను కలిసి చెక్‌డ్యామ్‌ల నిర్మాణం కోసం రూ.50 కోట్లు మంజూరు చేయాలని కోరనున్నట్లు రాజయ్య చెప్పారు. రానున్న రోజుల్లో నియోజకవర్గంలోని అన్ని చెరువులు, చెక్‌డ్యామ్‌లకు జలకళ సంతరింప చేసేలా కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ చందా స్వప్న, ఉప సర్పంచ్ కొప్పుల లింగయ్య, ఎంపీటీసీ మాదారపు రజిత, పీఏసీఎస్ చైర్మన్ తీగల కరుణాకర్‌రావు, రైతుబంధు సమితి కోఆర్డినేటర్ కడారి శంకర్, కుడా డైరెక్టర్ ఆకుల కుమార్, సర్పంచ్ల ఫోరం మండలాధ్యక్షుడు గాదె ప్రవీణ్‌రెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మహేందర్‌రెడ్డి, నియోజకవర్గ కోఆర్డినేటర్ గుజ్జరి రాజు, నాయకులు నల్లతీగల రవి, యాకయ్య, మొగిలి తదితరులు పాల్గొన్నారు.
తాజావార్తలు
- మహిళపై అత్యాచారం.. నిప్పంటించిన తండ్రీకుమారుడు
- ఆటబొమ్మల తయారీ పరిశ్రమలో అగ్నిప్రమాదం
- జమ్మూలో ఉగ్రవాదుల భారీ డంప్ స్వాధీనం
- కరీంనగర్ జిల్లాలో పార్థీ గ్యాంగ్ కలకలం
- వివాహేతర సంబంధం.. ప్రియుడితో భర్తను చంపించిన భార్య
- పెండ్లి చేసుకుందామంటూ మోసం.. మహిళ అరెస్ట్
- ‘సారస్వత’ పురస్కారాలకు 10 వరకు గడువు
- కాళేశ్వరంలో నేడు శ్రీవారి చక్రస్నానం
- భర్తపై కోపంతో.. అట్లకాడతో పిల్లలకు వాతలు
- ఏప్రిల్ 1 నుంచి పట్టాలెక్కనున్న మరో 6 రైళ్లు