Jangaon
- Jan 06, 2021 , 01:56:31
VIDEOS
అభివృద్ధి పనులు పరిశీలించిన ఎమ్మెల్యే ముత్తిరెడ్డి

జనగామ, నమస్తే తెలంగాణ, జనవరి 5 : జనగామ పట్టణంలోని ఆర్టీసీ చౌరస్తాలో సెంట్రల్ లైటింగ్ పనులు సహా హైదరాబాద్ ప్రధాన రహదారిపై నిర్మిస్తున్న వరదనీటి మళ్లింపు పైపులైన్ పనులను మంగళవారం ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి పరిశీలించారు. రంగప్పచెరువు నుంచి కురుమవాడ మీదుగా వచ్చే వరదనీటితో హైవేకు గండిపడి రోడ్డు దెబ్బతిని రాకపోకలకు అంతరాయం ఏర్పడిన నేపథ్యంలో ఎమ్మెల్యే స్పందించి పైపులైన్ పనులు చేపట్టారు. హైవేలో ప్రస్తుత సెంట్రల్ లైటింగ్ పోల్ స్థానంలో కొత్తగా హైమాస్ట్ లైట్ పోల్‌ను నిర్మించగా వాటి పనులు యాదగిరిరెడ్డి పరిశీలించారు. పట్టణంలో చేపట్టాల్సిన మిగిలిన అభివృద్ధి పనులపై మున్సిపల్ అధికారులకు ఆయన సూచనలు చేశారు.
తాజావార్తలు
MOST READ
TRENDING