రైతుల ఆర్థికాభివృద్ధికి డీసీసీబీ చేయూత

- వైస్ చైర్మన్ కుందూరు వెంకటేశ్వర్‌రెడ్డి
కొడకండ్ల జనవరి 5 : రైతులను ఆర్థికంగా అభివృద్ధి చేసేందుకు వరంగల్ జిల్లా సహకార కేంద్ర బ్యాంకు(డీసీసీబీ) చేయూతనిస్తున్నదని వైస్ చైర్మన్ కుందూరు వెంకటేశ్వర్‌రెడ్డి అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని ఐకేపీ భవనంలో జిల్లా సహకార కేంద్ర బ్యాంకు ఆధ్వర్యంలో ప్రగతి సేవా సంస్థ నిర్వహణలో పాడి పరిశ్రమపై రైతులతో నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. డీసీసీబీ బ్యాంకు ద్వారా పాడి రైతులకు రుణ సదుపాయం కల్పిస్తున్నామని పేర్కొన్నారు. ఐదుగురు సభ్యులు సంఘంగా ఏర్పడితే వారికి రుణం లభిస్తుందని వెంకటేశ్వర్‌రెడ్డి వివరించారు. భూమి తనఖా పెట్టకుండా గ్రూపు సభ్యుల ఆమోదంతో పాడి పరిశ్రమకు రుణం మంజూరు చేస్తామని ఆయన చెప్పారు. సభ్యులు నెల వాయిదాలు చెల్లించేందుకు వీలుగా డీసీసీబీ బ్యాంక్‌లో అకౌంట్ ఓపెన్ చేస్తామని, ఇందులో రైతులు పొదుపు చేసుకోవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో ఏజీఎం మధు, ప్రగతి సేవా సంస్థ నుంచి గద్దల జాన్, సొసైటీ వైస్ చైర్మన్ మేటి సోమరాములు, ఐకేపీ ఏపీఎం సోమయ్య, పాడి రైతులు పాల్గొన్నారు.
తాజావార్తలు
- ఆ నగరంలో మాంసం.. గుడ్లు నిషేధం!..
- నేను ఐటెంగాళ్ ను కాదు: అనసూయ
- ప్రైవేటు రంగంలో స్థానిక రిజర్వేషన్ల బిల్లుకు గవర్నర్ ఆమోదం
- కొవిడ్-19 సర్టిఫికెట్‌పై ప్రధాని ఫోటో ప్రచార ఎత్తుగడే : తృణమూల్ కాంగ్రెస్
- ఏపీలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు
- చివరి టెస్టుకు నెట్స్‌లో భారత ఆటగాళ్ల ప్రాక్టీస్
- టాప్-10 బిలియనీర్లలో జాక్‌మా మిస్?!
- వీడియో : ప్రాణాపాయ స్థితిలో ఉన్న వ్యక్తిని కాపాడిన ఎమ్మెల్యే
- అంగన్ వాడీల సమస్యలన్నీ పరిష్కరిస్తాం
- బెంగాల్లో అరాచక వాతావరణం కనిపిస్తోంది : యూపీ సీఎం