యాసంగిలో పెరగనున్న వరి సాగు

- చెరువులు, పుష్కలంగా జలాలు
- వాతావరణ పరిస్థితులు సైతం అనుకూలం
రఘునాథపల్లి, జనవరి 4 : వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉండడంతో ఈ యాసంగి సీజన్లో వరి సాగు విస్తీర్ణం గణనీయంగా పెరుగుతున్నది. వానకాలం లో భారీ వర్షాలు కురవడంతో వాగులు, వంకలు పొంగి పొర్లాయి. చెరువులు, కుంటల్లోకి వర్షపు నీరు చేరింది. మరోవైపు భూగర్భజలాలు పెరగడంతో నీటి సౌకర్యం లేని ప్రాంతాల్లో బోర్ల ద్వారా పంటలు సాగు చేస్తున్నారు. గత వానకాలం సీజన్లో మండలంలో వరి పంట సుమారు 15 వేల ఎకరాల్లో, పత్తి 8086 ఎకరాల్లో, కూరగాయలు 54 ఎకరాల్లో సాగు చేశారు. అతివృష్టి మూలంగా వరదలు పొంగిపొర్లడంతో కొంత పంట నష్టం జరిగింది. నెల రోజులకుపైగా ముసురు కురవడంతో రైతులు నష్టపో యారు. ఈ నేపథ్యంలో యాసంగిలోనైనా ప్రయోజనం పొందాలని అన్నదాతలు భావిస్తున్నారు. ఇందుకను గుణంగా వరి నార్లు పోయగా వాతావరణం అనుకూలంగా ఉండడంతో పలు గ్రామాల్లో నాట్లు వేస్తున్నారు.
చెరువుల్లో పుష్కలంగా జలాలు
చెరువులు, కుంటల్లో పుష్కలంగా నీరుండడంతో ఈ యాసంగిలో పంటల సాగు పెరగనుందని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. దేవాదుల(జే చొక్కారావు) ఎత్తిపోతల పథకంలో భాగంగా అశ్వరావుపల్లి రిజర్వా యర్‌లో నీరుండడంతో దీని కింద 1380 ఎకరాల్లో వరి సాగవుతుందని అంచనా. దీనికితోడు రిజర్వాయర్ నుంచి నీటిని చెరువులకు విడుదల చేసే అవకాశం ఉండడంతో ఈ సీజన్లో మండలంలో 16,508 ఎకరాల్లో వరి వేసే అవకాశముందని అధికారులు తెలిపారు. మరోవైపు నెల క్రితం నారు పోసిన రైతులు పలు గ్రామాల్లో నాట్లు వేస్తున్నారు. ఈ నెలాఖరు వరకూ నాట్లు వేసేందుకు అన్నదాతలు పొలాలను సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే రైతుబంధు పథకంలో నగదు రైతుల ఖాతాల్లో జమకావడంతో పంటల పెట్టుబడికి ఇబ్బందిలేదని భావిస్తున్నారు. యాసంగిలో వాతావరణం అనుకూలంగా ఉంటున్నందున వరి సాగు బాగుంటుందని భావిస్తున్నారు.
అనుకూలంగా వాతావరణం..
ఈ సంవత్సరం యాసంగి సీజన్లో వాతావరణం అను కూలంగా ఉంది. పంటల సాగు విస్తీర్ణం పెరిగే అవకా శముంది. గత వానకాలంలో వర్షాలు బాగా కురియడంతో చెరు వులు, కుంటల్లో నీరుంది. అశ్వరావుపల్లి రిజర్వాయర్‌తో మరింత సాగు పెరుగుతుందని భావిస్తున్నాం. రైతుబంధు పథకంలో నగదు రైతుల ఖాతాల్లో జమకావడంతో పంట పెట్టుబడికి ఇబ్బందులు లేవు. ఎరువులు పుష్కలంగా ఉన్నాయి. ఈ యాసంగిలో వరి సాగు విస్తీర్ణం 16 వేల ఎకరాలకు పెరుగుతుందని భావిస్తున్నాం.
-కాకి శ్రీనివాస్‌రెడ్డి, మండల వ్యవసాయ అధికారి