శనివారం 27 ఫిబ్రవరి 2021
Jangaon - Jan 04, 2021 , 02:55:18

మంత్రి ఎర్రబెల్లికి పలువురి శుభాకాంక్షలు

మంత్రి ఎర్రబెల్లికి పలువురి శుభాకాంక్షలు

పాలకుర్తి రూరల్‌, జనవరి 3 : నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావును పలువురు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. లయన్స్‌ క్లబ్‌ మండల అధ్యక్షుడు రాపాక విజయ్‌, ప్రధాన కార్యదర్శి దేవసాని కృపాకర్‌ ఆదివారం హన్మకొండలోని మంత్రి ని వాసంలో దయాకర్‌రావును మహాకవి భక్త పోతన జ్ఞాపికను, పుస్తకాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి మాట్లాడుతూ ఈ ఏడాది తెలంగాణ రాష్ట్రం మరింత అభివృద్ధి చెందాలని, ఉమ్మడి వరంగల్‌ జిల్లా ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. బమ్మెర పోతన, పాల్కురికి సోమనాథుడి స్మారక మందిరాలతోపాటు వల్మీడి ఆలయాల అభివృద్ధికి కృషి చేస్తున్నా మని, పర్యాటక ప్రాంతాలుగా తీర్చి దిద్దుతున్నామని ఆయన ఈ సం దర్భంగా వివరించారు.

VIDEOS

logo