సోమవారం 08 మార్చి 2021
Jangaon - Jan 04, 2021 , 02:55:22

సేవా కార్యక్రమాలు అభినందనీయం : ఎర్రబెల్లి

సేవా కార్యక్రమాలు అభినందనీయం : ఎర్రబెల్లి

పాలకుర్తి, జనవరి 3: ఎర్రబెల్లి దయన్న యువసేన నిర్వహించే సేవా కార్యక్రమాలు అభినందనీయమని రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అ న్నారు. యువసేన వ్యవస్థాపక అధ్యక్షుడు మేడారపు సుధాకర్‌ రూపొందించిన నూ తన సంవత్సర క్యాలెండర్‌ను ఆదివారం హన్మకొండలో మంత్రి ఎర్రబెల్లి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు. తల్లిదండ్రులు లేని పిల్లలను యువసేన బాధ్యులు తనవద్దకు తీసుకోస్తే తాను దత్తత తీసుకుని చదివిస్తున్నానని ఎర్రబెల్లి గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో సురేశ్‌నాయక్‌, కోడెం సాయిరామ్‌, అరవింద్‌, అఖిల్‌, మధు, అభిషేక్‌, వెంకటేశ్‌, శ్రీను తదితరులు పాల్గొన్నారు.


VIDEOS

logo