మంగళవారం 02 మార్చి 2021
Jangaon - Jan 03, 2021 , 04:15:44

పల్లెప్రగతిలో ప్రజలు భాగస్వాములు కావాలి

పల్లెప్రగతిలో ప్రజలు భాగస్వాములు కావాలి

  • గ్రామసభల్లో అధికారులు, ప్రజాప్రతినిధులు

పాలకుర్తి రూరల్‌ జనవరి 2 : పల్లెప్రగతి కార్యక్రమం తోపాటు గ్రామాభివృద్ధిలో ప్రజలు భాగస్వాములు కావాలని మండల ప్రత్యేకాధికారి, ఏపీడీ ఎండీ నూరొద్దీన్‌ అన్నారు. శనివారం మండలంలోని లక్ష్మీనారాయణపురంలో నిర్వహించిన గ్రామసభకు సర్పంచ్‌ మల్యాల సరిత పరశురాములు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా నూరొద్దీన్‌ మాట్లాడుతూ కలెక్టర్‌ ఆదేశాల మేరకు గ్రామాల్లో జరిగిన పనులకు నిధులు విడుదల చేస్తున్నామన్నారు. తక్షణమే సర్పంచ్‌లు, పంచాయతీ కార్యదర్శులు పనుల నివేదికలను సమర్పించాలన్నారు. గ్రామాలాభివృద్ధే ఉపాధి హామీ లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో వనపర్తి ఆశోక్‌కుమార్‌, పీఆర్‌ ఏఈ పాషా, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఏఈ ప్రశాంతి, ఎంపీవో దయాకర్‌, ఏపీవో అంబాల మంజుల, ఎంపీటీసీ బెల్లి సోమయ్య, ఉప సర్పంచ్‌ బొడిగె ప్రదీప్‌, పంచాయతీ కార్యదర్శి గంట శిరీష, కారోబార్‌ కుమార్‌, ఈసీ రమేశ్‌, సీసీ శోభ, మాజీ ఎంపీటీసీ గిలకత్తుల శంకరయ్య, ఆశోక్‌, పడిశె ఆశోక్‌, బండిపెల్లి మణెమ్మ, గుండ భిక్షపతి, ఎలేందర్‌ పాల్గొన్నారు.

సమస్యలపై అధికారులకు వినతి

స్టేషన్‌ఘన్‌పూర్‌ : మండలంలోని విశ్వనాథపురం గ్రామస్తులు స్థానిక సమస్యలపై సంబంధిత అధికారులకు వివరించారు. సర్పంచ్‌ అనుమాల మల్లేశం అధ్యక్షతన జరిగిన గ్రామసభలో పలువురు మాట్లాడుతూ అర్హులందరికీ ఆసరా పథకంలో పెన్షన్‌ ఇవ్వాలని కోరారు. మురుగు కాలువలు తీయకపోవడంతో దుర్వాసన వెలువడుతున్నదని అధికారుల దృష్టికి తెచ్చారు. ఈ సమావేశంలో మండల ప్రత్యేకాధికారి భిక్షపతి, ఎంపీవో మహబూబ్‌ అలీ, వెలుగు ఏపీఎం కవిత, పీఆర్‌ ఏఈ జుమ్కిలాల్‌, ఆర్‌డబ్ల్యూ ఎస్‌ ఏఈ రజిత, ఈజీఎస్‌ ఏపీవో సతీశ్‌చారి, పంచాయతీ కార్యధర్శి నరేశ్‌, ఉప సర్పంచ్‌ దాసు నర్సయ్య పాల్గొన్నారు.

అభివృద్ధి పనులు పూర్తి చేయాలి

జనగామ రూరల్‌ : గ్రామాల్లో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులు త్వరగా పూర్తి చేయాలని ఎంపీడీవో బిరుదు హిమబిందు అన్నారు. శనివారం మండలంలోని వడ్లకొండలో నిర్వహించిన గ్రామసభలో ఆమె మాట్లాడారు. పూర్తయిన పనులకు వెంటనే బిల్లులు చెల్లిస్తున్నామని వివరించారు. ఉపాధి కూలీలకు పనులు కల్పించాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని హిమబిందు కోరారు. ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి శంకర్‌రావు, ఎంపీవో ఉప్పుగల్లు సంపత్‌ కుమార్‌, సర్పంచ్‌ బొల్లం శారదాస్వామి, ఎంపీటీసీ బొల్లం బాలసిద్ధులు, ఉప సర్పంచ్‌ గాజె అనిల్‌, ఏపీవో భిక్షపతి, పంచాయతీ కార్యదర్శి ఇఫ్తికారుద్దీన్‌, ఈసీ మాధవరెడ్డి పాల్గొన్నారు.

అభివృద్ధి పనులు పూర్తి చేయాలి

బచ్చన్నపేట : పల్లెప్రగతిలో భాగంగా గ్రామంలో చేపట్టిన అభివృద్ధి పనులు త్వరగా పూర్తి చేయాలని ఎంపీడీవో రఘురామకృష్ణ అన్నారు. శనివారం మండలంలోని మన్‌సాన్‌పల్లిలో సర్పంచ్‌ పంజాల తారశ్రీధర్‌ అధ్యక్షతన నిర్వహించిన గ్రామసభలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ లక్ష్యానికనుగుణంగా ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పని చేయాలని రఘురామకృష్ణ కోరారు. అనంతరం శ్మశానవాటిక, డంపింగ్‌యార్డు, పల్లెప్రకృతివనం. నర్సరీ పనులను మండల ప్రత్యేకాధికారి శ్రీనివాస్‌రెడ్డితో కలిసి అధికారుల బృందం పరిశీలించింది. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ గూడెపు లతాశ్రీతిరుపతిగౌడ్‌, ఏపీఎం జ్యోతి, ఈసీ మోహన్‌, గ్రామ కార్యదర్శి కిరణ్‌కుమార్‌, కారోబార్‌ శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

సమస్యలు పరిష్కరించేందుకే గ్రామ సభులు

లింగాలఘనపురం : స్థానిక సమస్యలను పరిష్కరించేందుకే గ్రామసభలు నిర్వహిస్తున్నామని ఎంపీడీవో సురేందర్‌ అన్నారు. మండలంలోని ఏనెబావిలో సర్పంచ్‌ యాదమ్మ అధ్యక్షతన శనివారం జరిగిన పల్లెప్రగతి గ్రామ సభలో ఆయన మాట్లాడారు.ప్రతీ గ్రామంలో ఇంటింటికీ తడి పొడి చెత్త బుట్టలను పంపిణీ చేశామన్నారు. అన్ని గ్రామాల్లో శ్మశాన వాటికలు, నర్సరీలు, డంపింగ్‌ యార్డులు ఏర్పాటు చేశామన్నారు. సమావేశంలో  స్పెషలాఫీసర్‌ లత, ఎంపీవో మల్లికార్జున్‌, ఏఈలు శ్రీనివాస్‌, రోహిణి, ఈసీ వెంటేశ్‌, పంచాయితీ కార్యదర్శి కరుణాకర్‌, టీఏ స్వర్ణలత, ఉపసర్పంచ్‌ పుట్ట సిద్ధులు పాల్గొన్నారు.

పల్లెప్రగతి పనులు త్వరగా పూర్తి చేయాలి

రఘునాథపల్లి : పల్లెప్రగతిలో చేపట్టిన పనులను త్వరగా పూర్తి చేయాలని మండల ప్రత్యేక అధికారి, డీఈవో యాదయ్య అన్నారు. శనివారం మండలంలోని లక్ష్మీతండాలో సర్పంచ్‌ పయ్యావుల లావణ్య అధ్యక్షతన నిర్వహించిన గ్రామసభలో యాదయ్య మాట్లాడుతూ పూర్తయిన పనులకు వెంటనే బిల్లులు చెల్లిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో హసీం, ఎంపీటీసీ శాగ నాగరాజు, ఇన్‌చార్జి ఏపీవో శ్రీనివాస్‌, ఏపీఎం సారయ్య పాల్గొన్నారు. 

అభివృద్ధి పనుల్లో లక్ష్మాతండా ఆదర్శం

దేవరుప్పుల : అభివృద్ది పనుల్లో లక్ష్మాతండా ఆదర్శంగా  నిలుస్తుందని మండల ప్రత్యేకాధికారి, ఉపాధిహామీ ఏపీడీ కొండల్‌రెడ్డి అన్నారు. శనివారం లక్ష్మాతండాలో నిర్వహించిన గ్రామసభకు సర్పంచ్‌ వీరేశ్‌ అధ్యక్షత వహించారు. కొండల్‌రెడ్డి మాట్లాడుతూ పల్లె ప్రగతి పనుల్లో ముందుండడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ ఉపేందర్‌, ఏపీవో శ్రీనివాస్‌, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఏఈ మానస, పంచాయతీ కార్యదర్శి నాగరాణి, పాండు, టీఏ నర్సింహ పాల్గొన్నారు.

అభివృద్ధికి సహకరించాలి

కొడకండ్ల : అభివృద్ధికి ప్రజలు సహకరించాలని అధికారులు కోరారు. మండలంలోని రామేశ్వరంలో నిర్వహించిన గ్రామసభకు సర్పంచ్‌ జాటోత్‌ రాములు నాయక్‌ అధ్యక్షతన వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్‌ మాట్లాడుతూ పల్లె ప్రకృతి వనానికి విద్యుత్‌ సౌకర్యం కల్పించాలని, రోడ్డు మంజూరు చేయాలని అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్‌ దైవాదీనం, ఎంపీవో హరిప్రసాద్‌, ఎంపీటీసీ చెంచు మణెమ్మ, ఏపీవో కుమారస్వామి, ఐకేపీ ఏపీఎం దండెంపల్లి సోమయ్య, చెంచు రాజిరెడ్డి, ఉప సర్పంచ్‌, వార్డు సభ్యులు పాల్గ్గొన్నారు.


VIDEOS

logo